
లిండా ఇవాంజెలిస్టా అంటే తెలుగు వాళ్లకు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె ఒక సంచలనం. ముఖ్యంగా 80, 90ల కాలంలో లిండా కంటూ ఓ ప్రత్యేకమైన పేరు ఉంది. ఆమె పేరుకి తగ్గట్టు సూపర్ మోడల్ గా ఆమె బాగానే సంపాదించింది. పైగా ఓ దశలో నవోమి కాంప్ బెల్, కేట్ మోస్ వంటి ప్రఖ్యాత మోడల్స్ తో పాటు సమానంగా స్టార్ డమ్ సాధించింది.
అయితే అంతటి పాపులర్ మోడల్ అయినా లిండా ఇవాంజెలిస్టా జీవితం ఓ మోసానికి బలి అయింది. ఓ మోసపూరిత కాస్మెటిక్ ట్రీట్‌మెంట్ కారణంగా లిండా ఇవాంజెలిస్టా జీవనోపాధిని నాశనం అయింది. అలాగే ఆమెను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఈ విషయాన్ని లిండా తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
ఇంతకీ లిండా ఇవాంజెలిస్టా పెట్టిన మెసేజ్ లో ఏమి ఉంది అంటే.. ‘ఐదు సంవత్సరాల క్రితం నేను ఒక కాస్మెటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ ట్రీట్మెంట్ నా జీవితాన్ని నాశనం చేసింది. కేవలం ఆ ట్రీట్మెంట్ వల్లే నేను శాశ్వతంగా వైకల్యం చెందాను. ఓ సంస్థ నాకు సర్జరీ లేకండా ఫ్యాట్ కంటెంట్ తొలగిస్తామని చెప్పింది.
పైగా ఆ సంస్థ నన్ను నమ్మించింది. నేను వైద్యం చేయించుకున్నాను. కానీ, ఆ వైద్యం విరుద్ధంగా జరిగింది. ఆ ట్రీట్‌మెంట్ సైడ్-ఎఫెక్ట్ నా జీవనాధారాన్ని పోగొట్టింది. దాంతో నేను తీవ్ర నిరాశకి లోనయ్యాను అంటూ ఆమె విచారం, ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక లిండా తనకు జరిగిన అన్యాయంపై చట్టపరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.