https://oktelugu.com/

Donald Trump : అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌పై సంచలన ఆరోపణ.. బాంబు పేల్చిన మాజీ మోడల్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో 12 రోజుల్లో జరుగబోతున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు కూడా ప్రచారంలో స్పీడ్‌ పెంచారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 24, 2024 / 06:45 PM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump :  అమెరికా అధ్యక్ష ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. నవంబర్‌ 5న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు. డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా వీడియోపై ట్రంప్‌ ఇటీవల విమర్శలు చేశారు. దీంతో కమలా కూడా ట్రంప్‌ గెలిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీవ్‌లో కూర్చుంటాడని ఆరోపించారు. ట్రంప్‌కు జ్ఞాపకశక్తి మందగిస్తోందని కూడా ఆరోపించారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల తరఫున కీలక నేతలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఓ మాజీ మోడల్‌ సంచలణ ఆరోపణలు చేశారు. ఓ సందర్భంగా ట్రంప్‌ తనను అసభ్యకరంగా తాకాడని పేర్కొంది. వారి మధ్య పరిచయం గురించి కూడా వెల్లడించింది. ఈమేరకు ప్రముఖ మీడియా సంస్థ ‘ది గార్డియన్‌’ పత్రిక కథనం ప్రచురించింది.

    1992లో పరిచయం..
    స్టాసీ విలియమ్స్‌ అమెరికా మాజీ మోడల్‌. 1992లో ట్రంప్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రముఖ ఫైనాన్షియర్‌ జెప్లే ఎఫ్‌ స్టీన్‌తో డేటింగ్‌లో ఉన్న ఆమెను ఓ పార్టీలో ట్రంప్‌కు పరిచయం చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమెను ఓ రోజు జెఫ్రే తనను న్యూయార్క్‌లోని ట్రంప్‌ నివాసానికి తీసుకెళల్లాడని తెలిపింది. తనను చూసి జెఫ్రీ, ట్రంప్‌ నవ్వుకున్నారని పేర్కొంది. అప్పుడే ట్రంప్‌ తనను ఆయనవైపు లాక్కొని ఎంతో అసభ్యకరంగా తాకారని వెల్లడించింది. కమలా హారిస్‌ ప్రచార బృందానికి ఈ విషయాన్ని ఫోన్‌ చేసి తెలిపినట్లు పేర్కొంది.

    20 మందిని వేధించాడు..
    జెఫ్రీ, ట్రంప్‌ ఇద్దరూ బాగా క్లోజ్‌ అని, ఇద్దరూ ఎంతో సమయం గడిపేవారని మాజీ మోడల్‌ స్టాసీ విలియమ్స్‌ తెలిపారు. అతను 20 మందికిపైగా మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఆమె ఈ విషయాలను హారిస్‌ బృందానికి తెలుపగా వారు మీడియాకు తెలిపారని చెప్పింది. దీనిపై ట్రంప్‌ ప్రచార బృందం స్పందిస్తూ ఇదంతా కట్టుకథ అని కొట్టిపారేసిందని తెలిపింది.

    గతంలో కేసులు..
    ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్‌ ఇటీవలే లైంగిక వేధింపుల కేసుల్లో దోషిగా తేలాడు. మాజీ కాలమిస్ట జీన్‌ కార్పొల్‌పై ట్రంప్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం వాస్తవమే అని న్యూయార్క్‌ కోర్టు తేల్చింది. అంతేకాకుండా శృంగాత తార స్టార్మీ డేయిల్‌తో ఏకాంతంగా గడిపారని, దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు అనైతిక ఆర్థిక ఒప్పందం చేసుకున్నారన్న కేసులోనూ దోషిగా తేలారు. తాజాగా మాజీ మోడల్‌ స్టాసీ విలియమ్స్‌ ట్రంప్‌ వ్యవహార తీరుపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలకు 12 రోజుల ముందు ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారాయి. ఇవి ట్రంప్‌ గెలుపుపై ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.