Roma Michle Ramp walk : పాకిస్తాన్ లో మహిళలపై తీవ్ర వివక్ష ఉంటుందనేది ప్రపంచం అంతా తెలిసిందే. మతం పేరు చెప్పి వారు ఎదగకుండా అడ్డుకోవడం అక్కడ మామూలే. ఆడవారు అంటే బురకాలో.. వంటింటికి అంటిపెట్టుకొని ఉండాలనేది వారి వాదన. అరబ్ దేశాల మహిళలు సినిమాలు, సీరియల్స్ తో పాటు మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ లాంటి పోటీల్లో పాల్గొంటుంటే అదే మతాన్ని అడ్డుకొని పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆడవారిని ఎదగనీయకుండా తొక్కేస్తున్నాయి. పాకిస్థాన్ మోడల్ రోమా మిచెల్ బికినీ ర్యాంప్ వాక్ పాకిస్తాన్ లో పెద్ద వివాదానికి దారి తీసింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 అందాల పోటీలో పాకిస్థానీ మోడల్ రోమా మిచెల్ బికినీలో ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది, అయితే ఆమెపై అక్కడ అనేక విభాగాలు ధూషించాయి. దీంతో ఆ పోస్ట్ ను తొలగించారు. రోమా మిచెల్ తన దుస్తుల ఎంపిక కరెక్టుగా లేదని వాదనలు రావడతో ఆమె తన ఖాతా నుంచి వీడియోను తొలగించినట్లు తెలుస్తోంది. వీడియో తొలగించిన తర్వాత సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. అయితే, ఆమె అప్పుడు తొలగించిన వీడియో అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వైరల్ గా మారింది. ఎందుకంటే మిచెల్ పాకిస్తాన్‌లో సంప్రదాయిక నైతిక పోలీసింగ్‌కు గురైనందున వీడియోను తీసివేయడం తప్ప ఆమెకు వేరే మార్గం కనిపించలేదట.
‘సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ కు భయపడి ఆమె వీడియోను తొలగించవలసి వచ్చింది, పాకిస్తాన్‌లో మహిళల వస్త్రధారణకు సంబంధించిన సంస్కృతిక ఉద్రిక్తతలను హైలైట్ చేసింది,’ అని వీడియోకి సంబంధించి ఎక్స్ లో ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ఆమె దుస్తులపై కామెంట్ చేస్తూ.. ‘సంస్కృతిక ప్రాతినిధ్యం, వ్యక్తి గత స్వేచ్ఛపై చర్చలకు’ దారితీసిందని తెలిపారు.
రోమా మిచెల్ ఎవరు?
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ప్రకారం.. లాహోర్‌కు చెందిన రోమా మిచెల్ దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుంచి BTechలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. మిచెల్ తనకంటూ ఒక ప్రొఫెషనల్ మోడల్, నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆమె చాలా పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనర్లు, బ్రాండ్లతో పని చేస్తుంది. ఆమె రెండు సినిమాలు, తు జిందగీ హై మరియు ప్యారీ నిమ్మోతో సహా అనేక టెలివిజన్ షోలలో కనిపించింది .
ఆమె కేన్స్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ షోతో సహా పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఇన్ స్టాలో, మిచెల్‌కు 77,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లలో కొన్ని.
&