World Anaesthesia Day 2024: విక్టోరియన్ కాలం (1837-1901)లో ఆపరేషన్ అంటే భరించరాని నొప్పితో చాలా బాధాకరంగా, నరకం మాదిరి ఉండేది. అదొక మరణ శాసనం లాంటిది అని చెప్పాలి. ఇప్పుడు మత్తు మందులు కనిపెట్టడంతో హాయిగా, సురక్షితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. కానీ ఈ మత్తు మందు లేకపోతే ఎలా ఉండేది అని ఆలోచించారా? ఈ రోజు అనస్థేషియ డే. ఈ రోజే మత్తు మందును కనుగొన్నారు.
గతంలో బ్రిటన్‌కు చెందిన సర్జన్ రాబర్ట్ లిస్టన్ కు శస్త్రచికిత్సలో పేరు కాంచారు. ఈయన కేవలం 25 సెకన్లలోనే ఆపరేషన్ చేసి రోగి కాలు తొలగించేవారు. 1840ల్లో లండన్‌లోని యూనివర్శిటీ కాలేజ్ ఆస్పత్రిలో సర్జన్ రాబర్ట్ లిస్టన్ శస్త్రచికిత్సలు చేశారు. వేగంగా ఆపరేషన్లు చేయడం, విజయం సాధించడంలో ఆయన మంచి పేరు సంపాదించారు. అయితే డాక్టర్ రాబర్ట్ అవయవాలు తొలగించే క్రమంలో ప్రతి ఆరుగురు రోగుల్లో ఒకరు చనిపోయే వారట. అయితే, ఆ కాలంలోని మిగతా డాక్టర్లతో పోలిస్తే ఈయన దగ్గర మరణాల రేటు తక్కువ ఉండేది.
శస్త్రచికిత్స సమయంలో నొప్పితో అరుస్తున్న రోగులను అక్కడ ఉండే సహాయకులు చెక్క బల్లకు అదిమి పట్టుకునే వారట. ఎందుకంటే ఆ రోజుల్లో నొప్పిని తగ్గించే మందులు లేవు.నొప్పి తెలియకుండా శస్త్ర చికిత్స ఎలా చేయాలో తెలియదు. వేగంగా ఆపరేషన్లు చేయడం వల్ల రోగులు భయంకరమైన నొప్పిని అనుభవించే సమయం మాత్రం తగ్గుతుంది.
చరిత్ర
మొదటి ప్రదర్శన: అక్టోబరు 16, 1846న, డాక్టర్. మోర్టన్ మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో ఈథర్ అనస్థీషియాను ప్రదర్శించారు. ఇది వైద్య చరిత్రలో కీలక ఘట్టం అనే చెప్పాలి. మోర్టన్ ప్రదర్శన తరువాత, అనస్థీషియా రంగం వేగంగా అభివృద్ధి చెందింది, రోగి భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరచడానికి వివిధ ఏజెంట్లు, సాంకేతికతలు అభివృద్ధి చెందాయి
.
2024 కోసం థీమ్: అయితే ప్రపంచ అనస్థీషియా దినోత్సవ థీమ్ ప్రతి సంవత్సరం ప్రస్తుత సమస్యలు, రంగంలో పురోగతిని ప్రతిబింబించేలా మారుతుంది. 2024వ సంవత్సరం కోసం, థీమ్ ‘సేఫ్టీ ఇన్ అనస్థీషియా: ఎ గ్లోబల్ పెర్స్‌పెక్టివ్’పై దృష్టి పెడుతుంది. ఇక ఈ థీమ్ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తక్కువ-వనరుల సెట్టింగ్‌లలో మత్తుమందు పద్ధతుల భద్రత, సమర్థతను నిర్ధారించే ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
ప్రాముఖ్యత
అవగాహన: శస్త్రచికిత్స, నొప్పి నిర్వహణలో అనస్థీషియా కీలక పాత్ర గురించి అవగాహన పెంచడానికి ఈ రోజు కీలకంగా మారుతుంది. అయితే అనస్థీషియా పద్ధతులు, రోగి భద్రతను మెరుగుపరచడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం విద్య శిక్షణను ప్రోత్సహిస్తుంది. ఇదిలా ఉంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన అనస్థీషియా కేర్‌కు యాక్సెస్‌లో అసమానతలను హైలైట్ చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో మెరుగుదలలను సూచిస్తుంది.
ఆరోగ్య సంరక్షణ నిపుణులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక సంస్థలు, వైద్య సంస్థలు సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు, ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అవగాహన పెంచవచ్చు.
మొత్తం మీద ఒక వ్యక్తిని బల్లకు అదిమి పట్టి శస్త్ర చికిత్స చేసే దగ్గర నుంచి ఎలాంటి వ్యక్తి అవసరం లేకుండా నొప్పి తెలియకుండా చికిత్స చేసే మత్తు మందు వచ్చినందుకు సంతోషించాల్సిందే. లేదంటే ఇలాంటి శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు మానసికంగా రోగి, డాక్టర్‌లపై అతి దారుణమైన ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. రోగికి, డాక్టర్‌కు కూడా ఇదొక భయంకరమైన అనుభవం అవుతుంది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Special article on the occasion of world anesthesia day 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com