అద్భుత బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా బౌలర్లలకు చుక్కులు చూపించింది స్మృతి మందాన. దీంతో కెరీర్ లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. మంధాన ధాటికి భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. 170 బంతుల్లో సెంచరీ మార్కును అంందుకు ఈ బ్యూటిఫుల్ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్. అంతకు ముందు మొదటి రోజు వర్షం వల్ల జరగలేదు. కార్రా కేదిక గా ఆసీస్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సంగతి తెలిసిందే.

వర్షం కారణంగా తొలి రోజు ఆట నిలిచిపోయేసరికి భారత్ 132/1తో నిలిచింది. షెఫాలి వర్మ 31 పరుగులు చేసింది. ఎల్లీస్సీ పెర్రి వేసిన 52వ ఓవర్ లో పుల్ షాట్ ఆడిన ఆమె టెస్టుల్లో తొలి సెంచరీ సాధించింది. మరోవైపు మంధాన బ్యాటింగ్ చూసిన మాజీ క్రికెటర్లు వసీమ్ జాఫర్, ఆర్పీ సింగ్ ఫిదా అయ్యారు. టీమ్ ఇండియా ఓపెనర్ చూడచక్కని షాట్లతో అలరించిందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు శతకం సాధించడం గొప్ప విశేషమని, అది కూడా పింక్ బాల్ టెస్టులో సాధించడం మరి ప్రత్యేకమని కొనియాడారు.
జాఫర్ స్పందిస్తూ గాడెన్ ఆఫ్ ది ఆఫ్ సైడ్ అని అభివర్ణించాడు. కాగా మంధాన ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ చూడచక్కడటి షాట్లు ఆడింది. కవర్ డ్రైవ్స్, స్క్వేర్ డ్రైవ్స్, పుల్ షాట్లతో కళాత్మక మైన బ్యాటింగ్ చేసిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.