Visa Tourism: ద్వీపాలకు పెట్టింది పేరు ఇండోనేషియా.. తన సముద్రంలోని అందమైన ద్వీపాల్లో పర్యటకాన్ని ప్రోత్సహించడానికి ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండోనేషియాలోని బాలి ద్వీపంపై దృష్టి సారించింది. ఆగ్నేయాసియా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వృద్ధిని సాధించాలని.. దీర్ఘకాల పర్యాటక ప్రాంతంగా ఎదిగేందుకు ఇండోనేషియా నిర్ణయం తీసుకుంది. సంపన్న ప్రపంచ పౌరులను ఆకర్షించడానికి ఇండోనేషియా ఈ రేసులోకి ప్రవేశించింది.

ఇండోనేషియాలో కనీసం కోటి రూపాయలు (S$180,800 డాలర్లు) పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు ఉచిత వీసాను జారీ చేస్తామని ఆ దేశం ప్రకటించింది. మంగళవారం జారీ చేసిన కొత్త చట్టాల ప్రకారం.. 10 సంవత్సరాలపాటు బాలిలో ఉండేలా కొత్త “సెకండ్ హోమ్ వీసా”ను ప్రకటించింది. పెట్టుబడి పెట్టిన వారికి 10 ఏళ్లు బాలిలో నివాసం ఉండొచ్చు.
డిసెంబరు 25 తర్వాత ఈ చట్టం అమల్లోకి రానుంది. కొత్త రూల్ జారీ చేసిన 60 రోజుల తర్వాత పాలసీ అమల్లోకి వస్తుంది. “ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థకు సానుకూల సహకారం అందించడానికి కొంతమంది విదేశీయులకు ఇది ఆర్థికేతర ప్రోత్సాహం” అని ద్వీపంలో రిసార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇమ్మిగ్రేషన్ డైరెక్టర్ ప్రకటించారు.
కోస్టా రికా నుండి మెక్సికో వరకు ఉన్న దేశాల్లోని అందరికీ ఈ నియమాన్ని ఇండోనేషియా ప్రకటించింది. ప్రొఫెషనల్స్, రిటైర్ మెంట్ వారు , ఇతర సంపన్న వ్యక్తులను ఆకర్షించడానికి దీర్ఘకాల బసను అందించడానికి ఈ వీసీ సౌకర్యాన్ని అందిస్తోంది.
వలసలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలని అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జనాలు, సంపన్ను అందరూ సుఖవంతమైన జీవితం కోసం ప్రయత్నిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత అందరి అభురుచి మారింది. పనిని రిమోట్‌గా కొనసాగించడానికి బదులుకొత్తగా స్వేచ్ఛను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.అందుకే ఇండోనేషియా కూడా తమ దేశంలో డబ్బులు పెట్టుబడి పెడితే ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది.
ఇండోనేషియా 2021లో డిజిటల్ నోమాడ్ వీసా కోసం ప్రణాళికలను సిద్ధం చేసింది. అంతర్జాతీయ హాలిడే స్పాట్ గా దేశాన్ని మార్చాలని కంకణం కట్టుంది. విదేశీ మారకపు ఆదాయానికి ప్రధాన వనరు అయిన బాలికి సందర్శకులను ఆకర్షించడంపై దృష్టి సారించింది.
నవంబర్‌లో బాలిలో జరగనున్న గ్రూప్ ఆఫ్ 20 సమ్మిట్‌కు ముందు గరుడ ఇండోనేషియా వంటి విమానయాన సంస్థలు అంతర్జాతీయ విమానాలను పునఃప్రారంభించడంతో, ఇండోనేషియాకు విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పుంజుకుంది. ఇది ఈ ద్వీపంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు విప్లవాత్మక మార్పులు చేసిన ఇండోనేషియా.. మరి ఆ దిశగా పర్యాటకులను ఆకర్షిస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.