RGV- CM Jagan: ఆ ఇద్దరి దుష్ట చతుష్టయం ఒక్కటే. పవన్ కళ్యాణ్ ను నేరుగా ఎదుర్కోలేక ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కుట్రకు ఏపీ సీఎం ఆఫీస్ నిలయంగా మారింది. టాలీవుడ్ లోనే అత్యంత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో జగన్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు లీక్ అవుతున్నాయి. పవన్ ను రాజకీయంగా కంటే సినిమాల పరంగా దెబ్బతీసి.. ఆయన నైతిక స్థైర్యం దెబ్బతీసే మహాకుట్రకు జగన్ ‘తెర’ తీశారని.. వర్మతో కలిసి పవన్ పై మూడు సినిమాలు తీసేందుకు స్కెచ్ గీశాడని విశ్వసనీయ సమాచారం.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సమయం సందర్భం లేకుండా జగన్ ని వర్మ కలవడమేంటి? ఈ భేటీ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అనే సందేహాలు మొదలయ్యాయి. సినిమా టికెట్స్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వర్మ తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. వరుస ట్వీట్స్ తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ కావడం జరిగింది. సినిమా టికెట్స్ ధరలు సవరిస్తూ ప్రభుత్వం కొత్త జీవో జారీ చేయడంతో నెలల పాటు సాగిన ఆ రచ్చ ముగిసింది.
ఇప్పుడు జగన్ ని వర్మ నేరుగా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అరగంటకు పైగా జగన్-వర్మ మధ్య చర్చలు నడిచినట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంతో చిత్ర పరిశ్రమకు ఎలాంటి సమస్యలు లేవు. మరి ఏ విషయం మాట్లాడటానికి వర్మ సీఎం జగన్ ని కలిశాడన్న సందేహాలు మెదళ్ళు తొలిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక వాదన తెరపైకి వచ్చింది. జగన్ రాజకీయ అజెండాలో భాగంగా పవన్ కళ్యాణ్ ని దెబ్బతీయడం కోసమే ఈ భేటీ అంటున్నారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. చాలా కాలంగా తన పెళ్లిళ్లపై ప్రత్యర్ధులు చేస్తున్న ఆరోపణలకు పవన్ ధీటైన సమాధానం ఇచ్చారు. భార్యాభర్తలకు గిట్టనప్పుడు చట్టపరంగా విడిపోతే తప్పేంటని ప్రశ్నించారు. విడాకులు ఇచ్చిన ఇద్దరు భార్యలకు భరణంగా చెల్లించిన మొత్తాన్ని పవన్ బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ ఈ విషయం మాట్లాడేప్పుడు పరుషపదజాలం వాడారు. పేరుకు ఒక భార్యే కానీ ఒక్కొక్కడికి 30 స్టెప్నీలు అంటూ ధ్వజమెత్తారు. పవన్ ప్రసంగం రాజకీయవర్గాల్లో హీట్ పుట్టించింది.
పవన్ మూడు పెళ్లిపై అంత వివరణ ఇచ్చినా ఈ ఆరోపణలు ఆగే సూచనలు లేవంటున్నారు. పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ నేతలు పెద్ద ప్రణాళికలే రచిస్తున్నారట. పవన్ కళ్యాణ్ వివాహాలపై ఏకంగా సినిమాలు చేసేందుకు పావులు కదుపుతున్నారట. దీనిలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ సీఎం జగన్ ని కలిశారనేది హాట్ న్యూస్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వెండితెరపై తప్పుగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారట. పవన్ కళ్యాణ్ మూడు వివాహాలపై మూడు సినిమాలు రానున్నాయి అంటున్నారు. గతంలో కూడా పవన్ వ్యక్తిత్వాన్ని కించ పరిచే చిత్రాలు చేసిన వర్మను జగన్ ఎంచుకున్నారు అంటున్నారు. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుందట. 2024 ఎన్నికలకు ముందు థియేటర్స్ లోకి ఈ సినిమాలు తీసుకురానున్నారట.