Sanduk Ruit:వైద్యం అనేది నేడు వ్యాపారంగా మారిపోయింది. అదేదో సినిమాలో చూపించినట్టుగా కాసులు కురిపించే తంత్రం అయిపోయింది. రోగాన్ని నయం చేసుకోవడానికి ఆసుపత్రిలో చేరితే చాలు.. శవాల మీద చిల్లర ఏరుకున్నట్టు వైద్యులు రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. రోగాన్ని తగ్గించడం మాట దేవుడెరుగు.. అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అందువల్లే వైద్యులు ఒకప్పుడు దేవుళ్ళుగా కనిపిస్తే.. ఇప్పుడు వ్యాపారులుగా దర్శనమిస్తున్నారు.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
మనదేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లోనూ వైద్యం అనేది ఒక వ్యాపారం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వైద్యుడు దేవుడి అవతారం ఎత్తాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల మందికి ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్సలు చేసి తనలో ఉన్న మానవత్వాన్ని నిరూపించుకున్నాడు. నేపాల్ దేశానికి చెందిన సందుకు రూయిట్ వృత్తిరీత్యా నేత్ర వైద్యుడు. చిన్నప్పటి నుంచి ఆయన పేదవాళ్లకు సహాయం చేసేవాడు. అలాగే తన జీవితాన్ని పేదవారికోసం అంకితం చేశాడు. వారిలో చాలామంది నేత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటే చికిత్స చేసేవాడు. ఎక్కడో నేపాల్ లో పుట్టిన అతడు ఆసియా, ఆఫ్రికాలోని మారుమూల గ్రామాలకు తన సేవలను విస్తరించాడు. హిమాలయన్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన సంస్థ దాదాపు 14 లక్షలకు పైగా రోగులకు చికిత్స చేసింది. ఇందులో కటరాక్ట్ ఆపరేషన్లను లక్ష మందికి ఉచితంగా చేసింది. వారందరికీ చూపు తెప్పించింది.
ప్రస్తుతం నేపాల్ దేశం కల్లోల ప్రాంతంగా మారింది. అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అల్లర్లు చోటు చేసుకుంటున్సాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. మొన్న మన దేశం పక్కన ఉన్న ఓ ప్రాంతంలో మాదిరిగానే నేపాల్ లో పెను విధ్వంసం చోటు చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో అటువంటి దేశం నుంచి వచ్చిన సందూక్ లక్షలాదిమందికి జీవితాన్ని ప్రసాదించాడు. రంగులు కోల్పోయి.. నిర్జీవంగా మారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాడు. చాలా సందర్భాల్లో దైవం మనుషుల రూపంలో ఉంటుంది అంటారు. ఈ నానుడి నందుక్ కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే అతడు దేవుడు కాబట్టి. దేవుడి రూపంలో ఉన్న మనిషి కాబట్టి.