Rajamouli: దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన ప్రతి సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ చేసి పెట్టాయి… ఇక రాజమౌళి డైరెక్షన్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తుంటాడనే విషయం మనకు తెలిసిందే. కల్కి సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ పోషించి ఆ సినిమా మీద హైప్ ను తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సిరీస్ ఈనెల 18వ తేదీ నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. మరి ఈ ట్రైలర్ లో చూపించిన దాన్నిబట్టి చూస్తుంటే ఇందులో బాలీవుడ్ కి సంబంధించిన చిత్ర పరిశ్రమ ఏ విధంగా ఉంటుంది అందులోని లోటుపాట్లు ఏంటి అనే విషయాలను తెరమీద చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది… ఇక షారుక్ ఖాన్ తనయుడు అయిన ఆర్యన్ ఖాన్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషము…
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
అమీర్ ఖాన్ తో పాటు దిశాపటాని లాంటి వారు సైతం ఈ సిరీస్ లో కనిపించారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సిరీస్ లో రాజమౌళి నటిస్తున్నాడు కాబట్టి ఈ సిరీస్ కి చాలా మంచి క్రేజ్ అయితే దక్కినట్టుగా తెలుస్తోంది. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళికి చాలా మంచి గుర్తింపైతే ఉంది.
కాబట్టి ఆయన క్రేజ్ ను వాడుకోవడానికి అతన్ని ఈ సిరీస్ లో భాగం చేసినట్టుగా తెలుస్తోంది… ట్రైలర్ చాలా ఎంగేజింగ్ గా ఉండడంతో సిరీస్ మీద చాలా ఆసక్తి అయితే రేకెత్తిస్తోంది. మరి షారుక్ ఖాన్ కొడుకు దర్శకత్వం చేసిన ఈ సిరీస్ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తోంది. బాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక బాలీవుడ్ సిరీస్ లో మొదటిసారి రాజమౌళి కనిపించాడు.
ఇక సోషల్ మీడియా లో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి. మరి షారుక్ ఖాన్ మీద ఉన్న ఇష్టంతో రాజమౌళి ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించినట్టుగా తెలుస్తోంది. రాజమౌళి క్యారెక్టర్ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సిరీస్ రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…