President Election: మన దేశ ప్రధాని పౌరుడు/ పౌరురాలు రాష్ట్రపతే. రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. కొన్ని దేశాలలో మహారాణులు/ మహారాజులు ప్రథమ పౌరులుగా ఉంటారు. ఇంకా కొన్ని దేశాలలో ప్రధాన మంత్రులు ప్రథమ పౌరులు లేదా ప్రధమ పౌరు రాలిగా ఉంటారు. ఇంకా కొన్ని దేశాల్లో అధ్యక్షులు ఆ అర్హతను సాధిస్తారు. కానీ మనదేశంలో రాష్ట్రపతి మాత్రమే ప్రధమ పౌరుడు లేదా ప్రధమ పౌరురాలిగా ఉంటారు.. రాష్ట్రపతిని పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతికి కూడా ఇదే విధానం వర్తిస్తూ ఉంటుంది. ఇటీవల ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో.. ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి ఉప ఎన్నిక నేడు జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Also Read: పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరగబోతోంది!
ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు.. మనదేశంలో పార్లమెంట్, రాజ్యసభ కలిపి మొత్తం 786 ఓట్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి నాలుగు ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీ ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. దీంతో ఓట్లు వేసేవారు కేవలం 782 మంది మాత్రమే ఉంటారు. మన రాజ్యాంగంలో నిబంధనల ప్రకారం 394 ఓట్లు వచ్చినవారు ఉపరాష్ట్రపతి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎన్డీఏకు 425, ఇండియా కూటమికి 324 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎన్డీఏ అభ్యర్థి గెలవడం లాంచనమే అయినప్పటికీ.. ఇండియా కూటమి అభ్యర్థి ఏదైనా అద్భుతం జరుగుతుందని ఆశతో ఉన్నారు. ఎన్డీఏ, ఇండియా కూటమిల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీసీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని రాధాకృష్ణన్, తనని గెలిపించి ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి వివిధ సందర్భాల్లో కోరారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక కు సంబంధించి ఓటింగ్ ఉదయం పదిగంటల నుంచి మొదలై సాయంత్రం 5:00 వరకు పూర్తవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఒక లెక్కింపు మొదలవుతుంది.. గెలిచిన అభ్యర్థిని వెంటనే ప్రకటిస్తారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం లాంచనమే అయిన నేపథ్యంలో.. బిజెపి నాయకులు పెద్దగా ఇబ్బంది పడడం లేదు. పైగా ఇటీవల కేంద్ర హోం శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సల్వా జుడుం అనే సంస్థ విషయంలో ఆయన ఇచ్చిన తీర్పు అత్యంత ప్రమాదకరమైనదని వ్యాఖ్యానించారు. మరోవైపు సుదర్శన్ రెడ్డి కూడా ఆదే స్థాయిలో ఆయన కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే వీరిద్దరి మధ్య జరిగిన సంవాదం ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికను మరో స్థాయికి తీసుకెళ్లింది. అందువల్లే మీడియాలో ప్రధాన చర్చకు దారితీస్తోంది. జాతీయ మీడియా సంస్థలు ఉపరాష్ట్రపతి ఉప ఎన్నికను అమిత్ షా వర్సెస్ సుదర్శన్ రెడ్డి అన్నట్టుగా కథనాలను ప్రసారం చేశాయి. ఎన్ని ఓట్లు వచ్చినప్పటికీ.. తాము మాత్రం గట్టి పోటీ ఇస్తామని ఇండియా కూటమి అభ్యర్థి చెబుతున్నారు. మరి కొద్ది గంటల్లో పోలింగ్ మొదలుకానుంది.