Homeఅంతర్జాతీయంRussia Ukraine War : కిమ్ సైనికులకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్.. ప్రాణ భయంతో పరుగో...

Russia Ukraine War : కిమ్ సైనికులకు చుక్కలు చూపించిన ఉక్రెయిన్.. ప్రాణ భయంతో పరుగో పరుగు.. వైరల్ వీడియో

Russia Ukraine War ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాకు మద్దతు ఇస్తున్నాడు. ఉక్రెయిన్ తో కొంతకాలంగా రష్యా యుద్ధం సాగిస్తోంది. అయితే రష్యా తరఫున యుద్ధం చేయడానికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తన సైన్యాన్ని అక్కడికి పంపించాడు. అదే అక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల ఉత్తరకొరియా సైనికులు భారీ సంఖ్యలో చనిపోయారని.. అంతే సంఖ్యలో గాయపడ్డారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. అయితే దానిని బలపరిచే విధంగా ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో కనిపిస్తోంది.. యూరోపియన్ దేశాలు ఇచ్చిన మద్దతుతో ఉక్రెయిన్ రష్యా బలగాల మీదికి డ్రోన్లను ప్రయోగించింది.. అయితే వాటిని తట్టుకోలేక కిమ్ సైనికులు పరుగులు పెట్టారు. ప్రాణ భయంతో ఉరుకులు పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. కీవ్ నగరంలో స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ కొద్దిరోజులుగా యుద్ధంలో పాల్గొంటున్నాయి. అత్యాధునిక ఆయుధాలతో ఆపరేషన్లలో పాల్గొంటున్నాయి. అయితే రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో ఉత్తర కొరియా బలగాలు భారీగా మోహరించాయి. వారిని ఉక్రెయిన్ దళాలు ఆడుగడుగునా వెంటాడాయి. ఉక్రెయిన్ దళాలు కమికేజ్ డ్రోన్లు ప్రయోగించడంతో ఉత్తరకొరియా సైనికులు తట్టుకోలేకపోయారు. ఈ డ్రోన్ల దూకుడు వల్ల మూడు రోజుల్లో 77 మంది ఉత్తర కొరియా సైనికులు చనిపోయారు. అయితే దీనిపై ఇంతవరకు కిమ్, పుతిన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే దీనిని ఉక్రెయిన్ మాత్రం తెగ సమర్ధించుకుంటున్నది. తాము చేసిన ఆపరేషన్ వల్ల ఉత్తర కొరియా సైనికులు ప్రాణ భయంతో పరుగులు పెట్టారని పేర్కొంది..

కుర్స్క్ లో భారీగా మోహరించిన సైనికులు

కుర్స్క్ లో ప్రాంతంలో భారీగా ఉత్తరకొరియా సైనికులను మోహరించింది. దీని పరిధిలో మూడు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ పదివేల మందికి పైగా ఉత్తర కొరియా సైనికులు ఉన్నారు. వీరికి కొంతకాలంగా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత ఇటు రంగాల్లోకి దింపుతున్నారు. అయితే ఉత్తర కొరియా సైనికులకు భాషా పరమైన సమస్య ఏర్పడుతోంది. ఉత్తర కొరియా సైనికులకు ఇంగ్లీష్ మీద అంతగా అవగాహన లేదు. రష్యా సైనికులకు ఇంగ్లీష్ వచ్చినప్పటికీ.. వారికి అర్థవంతంగా వివరించడంలో విఫలమవుతున్నారు. మరోవైపు ఉత్తరకొరియా సైనికులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారని.. కిమ్ తన దర్పాన్ని ప్రదర్శించుకునేందుకు సైనికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడని దక్షిణ కొరియా ఆరోపిస్తోంది. కొంతకాలంగా దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పటికీ.. ఉత్తర కొరియా విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు రష్యాలో ఉత్తర కొరియా సైనికులు చనిపోవడంతో దక్షిణకొరియా స్పందించింది. అనవసరంగా ఉత్తరకొరియా సైనికుల ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించింది. ఇది సరైన పద్ధతి కాదని.. వివరించింది.. మరోవైపు ఉత్తర కొరియా సైనికులకు సమర్ధవంతంగా పోరాడే శక్తి లేకపోవడం వల్లే ప్రాణాలకు పోతున్నారని అమెరికా కూడా పేర్కొంది.. యుద్ధం వల్ల కిమ్ సైనికులు చాలామంది చనిపోయి ఉంటారని.. అదే సంఖ్యలో గాయపడి ఉంటారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular