Telangana Politics : ఇప్పుడు సడన్ గా ఆ పార్టీకి సమైక్య నినాదం గుర్తుకొస్తోంది. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రా వాళ్ళ ప్రయోజనాలు గుర్తుకొస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ప్రజల కాళ్లల్లో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని చెప్పిన వాళ్ళు.. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ సేవలో తరిస్తున్నారు. చదువుతుంటే ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ జరుగుతున్నది ఇదే.. కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సంధ్య థియేటర్ వివాదం ఎంత రచ్చ సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయరంగు పులముకోవడంతో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణ వాదాన్ని భుజాలకు ఎత్తుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి ఇప్పుడు సమైక్య నినాదాన్ని చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరిమేడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని భారత రాష్ట్ర సమితి విమర్శిస్తోంది. సంధ్య థియేటర్ వద్ద భద్రత కల్పించకుండా.. ఒక మహిళ ప్రాణం పోవడానికి రేవంత్ ప్రభుత్వం కారణమైందని భారత రాష్ట్ర సమితి ఆరోపిస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ ఆకస్మాత్తుగా రావడం వల్లే ఈ ఘటన జరిగిందని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
తీరు మారింది
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఆంధ్ర ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలు టార్గెట్ గా వ్యవహరించారు. నాడు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసిన పూరి జగన్నాథ్ కార్యాలయం పైకి ఎలా దూసుకువెళ్లారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదుర్స్ సినిమా విడుదలైనప్పుడు ఇలాంటి హడావిడి చేశారో ఇప్పటికీ చాలామందికి గుర్తుకే ఉంది. అయితే నాటి రోజులను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకున్నట్టున్నారు.. ఎందుకంటే ఇటీవల అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడి చేశారు. అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. ఓయూ జేఏసీ నాయకులు దాడి చేయడంతో అల్లు అర్జున్ ఇంటిపైన భారీగా పరదాలు రక్షణగా ఉంచారు. పోలీసులతో భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే ఈ దృశ్యాలను కొంతమంది తెలంగాణవాదులు మరో విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. ” భారత రాష్ట్ర సమితి భ్రష్టు పట్టిన రాజకీయాలు చేయడం వల్ల మొత్తం మారిపోయింది. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం పెరిగిపోయింది. ఫలితంగా ఉద్యమ సమయంలో ఆంధ్రావాళ్ల మీద రక్షణ పరదాలు కనిపించేవి. ఇప్పుడు ఓయూ జేఏసీ ఆ బాధ్యత తీసుకోవడంతో పరిస్థితి మళ్ళీ పునరావృతమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండడంతో.. దానిపై భారత రాష్ట్రపతి విమర్శలు చేస్తోంది. తన చేయాల్సిన పనిని చేయకుండా.. ఆంధ్ర వాళ్లకు సపోర్టుగా ఉంటున్నదని” తెలంగాణ వాదులు అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామం తెలంగాణలో విచిత్రమైన రాజకీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నదని వారు పేర్కొంటున్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్ల ఇళ్లపై కనిపించేవి… ఇప్పుడు మళ్ళీ..
ట్రాజెడీ ఏందంటే… నాటి టీఆర్ఎస్ ఇప్పుడు భ్రష్టుపట్టి చెత్త పాలిటిక్స్ ప్లే చేయడం… బీజేపీ అంతకుమించి దరిద్రం చూపించడం…#Telangana #AlluArjunepisode #SandhyaTheatreIncident #Pushpa2 #OUJAC pic.twitter.com/fGZOYGOhye— Anabothula Bhaskar (@AnabothulaB) December 24, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Police cordoned off allu arjuns house during congress rule
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com