Russia Ukraine war : ఈ దాడి తర్వాత రష్యా తీవ్రంగా స్పందిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఉక్రెయిన్ దాడులు చేస్తుంటే రష్యా ఊరుకునే రకం కాదు కదా.. గర్జిస్తోంది. విరుచుకుపడుతోంది. ఒక రకంగా ఉక్రెయిన్ దేశానికి దీపావళి పండుగ చూపిస్తోంది. ఉక్రెయిన్ తమ వాయుసేన స్థావరాలపై దాడులు చేసిన తర్వాత.. రష్యా అత్యంత తీవ్రస్థాయిలో ప్రతిస్పందిస్తోంది.. గడిచిన మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా ఒకేసారి 479 డ్రోన్లతో ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేసింది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ దేశానికి చెందిన వాయుసేన అధికారికంగా ధ్రువీకరించింది. కేవలం 400+ డ్రోన్లు మాత్రమే కాకుండా.. 20 మిసైల్స్ ని కూడా రష్యా ఉక్రెయిన్ మీదకు ప్రయోగించింది..ఉక్రెయిన్ లోని పశ్చిమ, మధ్య ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసింది.
టార్గెట్ రీచ్ అయింది కొన్నేనా?
రష్యాకు చెందిన 277 డ్రోన్లు, 19 మిస్సైల్స్ ను ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసినట్టు తెలుస్తోంది. అయితే మొత్తంగా 10 డ్రోన్లు, మిస్సైల్స్ మాత్రమే టార్గెట్లను రీచ్ అయినట్టు తెలుస్తోంది. మాస్కో చేసే దాడులు సాయంత్రం మొదలై తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి. అయితే చిమ్మ చీకట్లో చాలావరకు యూఏవీ లను గుర్తించడం ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్లే మాస్కో ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది.. ఇటీవల కాలంలో రష్యా ఉక్రెయిన్ పౌర నివాసాలను టార్గెట్ గా చేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు మాస్కో చేసిన దాడుల్లో 12,000 మంది ఉక్రెయిన్ ప్రజలు చనిపోయినట్టు తెలుస్తోంది.. అయితే మాస్కో మాత్రం తాము సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని చెబుతోంది.. ఇక మాస్కో అనుసరిస్తున్న సరికొత్త యుద్ధ వ్యూహానికి, అత్యంత పటిష్టమైన నౌకాదళ వ్యూహానికి ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆమోదముద్ర వేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా దీనిని రూపొందించడమే తమ లక్ష్యమని క్రెమ్లిన్ ప్రతినిధి నికోలాయ్ పత్రు షేవ్ స్పష్టం చేశారు. అయితే ఆ ప్రణాళిక గురించి ఆయన బయటికి చెప్పడానికి ఒప్పుకోలేదు.
అతిపెద్ద నేవి మాస్కో వద్దనే..
ఇక డ్రాగన్, శ్వేత దేశం తర్వాత మూడవ అతిపెద్ద నేవి మాస్కో వద్దనే ఉంది. ఇక ఇటీవల ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో దానికి భారీగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. ఇక ప్రస్తుతం రష్యా వద్ద 79 జలాంతర్గాములు ఉన్నాయి. ఇవి న్యూక్లియర్ ఫ్యూయల్ తో పనిచేస్తాయి. వీటితోపాటు 2002 యుద్ధ నౌకలు కూడా ఉన్నాయి.. ఇక 2050 వరకు మాస్కో నౌకా దళాన్ని అత్యంత శక్తివంతంగా రూపొందిస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు.. ఇక ఆసియాలోని పెద్ద దేశమైన డ్రాగన్ కూడా తన నౌకదళాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందిస్తోంది. ఇక 2030 నాటికి డ్రాగన్ వద్ద 460 యుద్ధ నౌకలు ఉంటాయని తెలుస్తోంది.