Romantic Destinations: ప్రయాణాలు చేయడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని, అక్కడ వాతావరణాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఎన్నో రొమాంటిక్ డెస్టినేషన్లు ఉన్నాయి. వీటిని లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాలని అనుకుంటారు. ఇలాంటి రొమాంటిక్ డెస్టినేషన్లకు కేవలం కపూల్స్ మాత్రమే కాకుండా.. చాలామంది వెళ్లాలని అనుకుంటారు. ఈ రొమాంటిక్ డెస్టినేషన్లు చూస్తే వావ్ అనిపిస్తాయి. ఒక్కసారి ఆ ప్రదేశాలకు తిరిగి వెళ్తే మళ్లీ అసలు రావాలని కూడా అనిపించదు. అలాంటి ప్రదేశాలు ఎన్నో కూడా ఈ ప్రపంచంలో ఉన్నాయి. అందులో మనం ఒక టాప్ 5 గురించి ఈ రోజు తెలుసుకుందాం.
సెయింట్ లూసియా
కరీబియన్‌లోని సెయింట్ లూసియాలో అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, విలాసవంతమైన రిసార్ట్‌లు ఉంటాయి. ఈ ప్లేస్ చూడటానికి చాలా రొమాంటిక్‌గా ఉంటుంది. ఎక్కువ శాతం జంటలు ఇక్కడికి వస్తుంటారు. అలాగే ఇక్కడ విలాసవంతమైన ఓవర్ వాటర్ బంగ్లాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఎందరో విశ్రాంతి తీసుకుంటారు. బీచ్‌లు, ప్రైవేట్ డిన్నర్‌లు చాలా హ్యాపీ అనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది.
బోరా బోరా
ఫ్రెంచ్ పాలినేషియాలో బోరా బోరా ఉంది. దీన్ని ప్రపంచంలోని అత్యంత శృంగార ద్వీపంగా పిలుస్తారు. టాప్ 2 రొమాంటిక్ డెస్టినేషన్‌లో ఇది ఒకటి. ఇక్కడ మణి మడుగులు, ఓవర్ వాటర్ బంగ్లాలు, శక్తివంతమైన పగడపు దిబ్బలు ఉంటాయి. అలాగే కపూల్స్‌కు ఏకాంతమైన, విలాసవంతమైన రిసార్ట్‌లు ఉంటాయి. అలాగే సముద్ర జీవులతో ఇక్కడ స్నార్కెలింగ్ చేయడంతో పాటు ప్రైవేట్ బీచ్‌లలో క్యాండిల్‌లైట్ డిన్నర్‌లు వంటివి కూడా ఆస్వాదించవచ్చు. సముద్రం లోపల కూడా ఆస్వాదించవచ్చు. ఈ బోరా బోరా అందాలు ఎలాగైన చూడాల్సిందే.
మాల్దీవులు
పెళ్లయిన కపూల్స్ ఎక్కువగా మాల్దీవులు వెళ్తుంటారు. ఇక్కడ సహజమైన బీచ్‌లు, విలాసవంతమైన రిసార్ట్‌లు ఎన్నో మరపురాని అనుభూతులను అందిస్తుంది. మాల్దీవుల్లోని పగడపు దిబ్బలు, ప్రైవేట్ సూర్యాస్తమయం క్రూయిజ్‌ని ఆస్వాదించడం వంటివి చాలా బాగుంటాయి. ఈ ద్వీపం చూడటానికి స్వర్గంలా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా హనీమూన్‌కి వెళ్లాలనుకునే వారు ఫస్ట్ మాల్దీవులకే ప్రాధాన్యత ఇస్తారు.
ఫిజీ
ఫిజీలోని అద్భుతమైన ద్వీపాలు చూడటానికి చూడముచ్చటిగా ఉంటాయి. ఇక్కడ ఉండే అందమైన బీచ్‌లు, దట్టమైన అరణ్యాలు, ప్రత్యేకమైన సాంస్కృతిక అనుభవాల చాలా బాగుంటాయి. ఇక్కడ బీచ్‌లో కాస్త సమయం సేద తీరితే చాలు.. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందరో కపూల్స్ ఈ ఫిజీ ప్రదేశానికి వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
అమాల్ఫీ
ఇటలీలోని అమాల్ఫీ తీరం ఎంతో మనోరమంగా ఉంటుంది. ఇక్కడ బీచ్ తీరంలో ఉండే గ్రామాలు, రంగు రంగుల భవనాలు ఎంతో ఆహ్లాదకంగా ఉంటాయి. ఈ తీరంలో క్లిఫ్‌సైడ్‌లో నడవడం, కాప్రి వంటి దీవులకు పడవ ప్రయాణాలు చేస్తుంటారు. తప్పకుండా లైఫ్‌లో ఈ రొమాంటిక్ డెస్టినేషన్లను చూడండి. ఒక్కసారి మీరు వీటిని చూస్తే అక్కడి నుంచి అసలు తిరిగి రావాలని కూడా అనుకోరు.