https://oktelugu.com/

Israel : ఇజ్రాయెల్‌వైపు దూసుకొస్తున్న రాకెట్లు.. విరుచుకుపడుతున్న హిజ్‌బుల్లా..!

ఇజ్రాయెల్, హమాస్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రికత్తంగా మారాయి. ముఖ్యంగా హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య తర్వాత పరిస్థితులు మరింత జఠిలమయ్యాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 5, 2024 / 11:36 AM IST
    Follow us on

    Israel : ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హమాస్‌ చీఫ్‌ ఇస్మాయెల్‌ హనియా హత్య తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ రగిలిపోతలోంది. హినియాను ఇజ్రాయెల్‌ బలగాలే చంపాయని ఇరాన్‌ అనుమానిస్తోంది. అమెరికా కూడా ఇందుకు సాయం చేసిందని భావిస్తోంది. ఫహద్, హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని, తాము చేసే దాడులు భయంకరంగా ఉంటాయని ఇరాన్‌ ఇప్పటికే హెచ్చరించింది. మరోవైపు యుద్ధం వస్తే ఇజ్రాయెల్‌కు ఏ సాయమైనా చేస్తామని అమెరికా ప్రెసిడెంట్‌ బైడెన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంంలో ఇరాన్‌ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఉగ్రవాద సంస్థ హిజ్‌బుల్లా వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్‌ హిల్లెల్‌ నగరంపై డజన్ల కొద్దీ కటియుషా రాకెట్లను ప్రయోగించింది. వాటిల్లో కొన్నింటిని ఇజ్రాయెల్‌ నిలువరించింది. ఇక ఈ దాడిపై హిజ్‌బుల్లా అధికారిక ప్రకటన చేసింది. కేఫర్‌ కేలా, డెయిర్‌ సిరియాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేసిందని, ఫలితంగా ఆ ప్రాంతాల పౌరులు గాయపడ్డారని, అందుకే తాము కటియుషా రాకెట్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. వరుస పరిణామాలపై ఇజ్రాయెల్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పారిపోతామంటే ప్రాణభిక్ష పెడతామని, కాదంటే అంతు చూస్తామని హెచ్చరిస్తోంది. అమెరికా సాయం కూడా తీసుకుంటుంది.

    అండగా అమెరికా
    యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెలక్కు రక్షణగా, దానికి సాయం చేసేందుకు ఆ ప్రాంతంలో అదనపు యుద్ధ నౌకలను, ఫైటర్‌ జెట్లను మోహరిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ చెప్పింది. అదే సమయంలో ఇరాన్‌ మద్దతు ఇస్తున్న హిజ్‌బుల్లా ప్రాభవం ఎక్కువగా ఉన్న లెబనాన్‌ను ఖాళీ చేయమని పాశ్చాత్య దేశాలు తమ పౌరులకు సలహా ఇచ్చాయి. ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ఈ ప్రాంతానికి రాకపోకల్ని నిలిపివేశాయి.

    స్కూల్‌పై దాడి..
    టెహ్రాన్‌లో హనియా హత్య, బీరూట్‌లో హిజ్బుల్లా మిలిటరీ చీఫ్‌ ఫువాద్‌ షుక్రును చంపినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించినట్లు కొద్ది సేపటికే హిజ్బుల్లా కటియుషా రాకెట్లను ప్రయోగించింది. ఇప్పటికే హిజ్‌బుల్లా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తూనే ఉంది. జులై 14న నుసిరత్‌ శరణార్థి శిబిరంలోని అబు ఒరేబన్‌ పాఠశాలపై జరిపిన దాడిలో 17 మంది పిల్లలు మరణించగా, 80 మంది గాయపడ్డారు. స్కూల్‌పై దాడి తర్వాతనే హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనీ, హిజ్బుల్లా మిలిటరీ చీఫ్‌ ఫువాద్‌ షుక్రును హతమార్చి ఇజ్రాయెల్‌ హెచ్చరికలు జారీ చేసింది.

    భారతీయులను అప్రమత్తం చేసిన ఎంబసీ..
    హిజ్‌బుల్లా లీడర్‌ ఫహద్‌ షుక్రు, హమాస్‌ చీఫ్‌ ఇస్మాయెల్‌ హరియా హత్య నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయులను ఇండియా ఎంబసీ హెచ్చిరించింది. వెంటనే ఎలబనాన్‌ నుంచి వెళ్లిపోవాలని, తదుపరి ఆదేశాల వరకు అక్కడకు వెల్లొద్దని సూచించింది. మరోవైపు ఇజ్రాయెల్‌కు వెళ్లే.. ఇజ్రాయెల్‌ నుంచి వచ్చే విమానాలను ఎయిర్‌ ఇండియా రద్దు చేసింది. అమెరికా, స్వీడన్, యూకే దేశాలు కూడా లెబనాన్‌లో ఉంటున్న తమ దేశ పౌరులను అలర్ట్‌ చేశాయి. వెంటనే ఆదేశాన్ని వీడి రావాలని సూచించాయి.