India Vs Great Britain: క్రీడా స్ఫూర్తికి తూట్లు.. నెత్తి మాసిన అంపైరింగ్ కు ఇది ప్రబల నిదర్శనం..

మ్యాచ్ ముగిసే సమయానికి కూడా రెండు జట్లు మరో గోల్ సాధించలేకపోయాయి.. దీంతో షూట్ అవుట్ అనివార్యమైంది. ఇదే క్రమంలో భారత గోల్ కీపర్ శ్రీజేష్ రెండు గోల్స్ ను అద్భుతంగా అడ్డుకున్నాడు. దీంతో భారత విజయం సాధించింది. ఆట ముగిసిన అనంతరం అంపైరింగ్ కు భారత జట్టు హాకీ సమాఖ్య అధికారులకు ఫిర్యాదు చేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 5, 2024 11:46 am
Follow us on

IND vs great Britain భారత హాకీ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆడుతోంది. పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో వరుస విజయాలను సాధిస్తూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆదివారం గ్రేట్ బ్రిటన్ జట్టుతో జరిగిన వాటర్ ఫైనల్స్ మ్యాచ్ లో పెనాల్టీ షూటౌట్ లో విజయం సాధించింది. ఏకంగా సెమీస్ వెళ్ళిపోయింది. గ్రేట్ బ్రిటన్ జట్టుపై భారత్ విజయం సాధించినప్పటికీ.. ఈ మ్యాచ్ లో అంపైరింగ్ పై అనుమానం వ్యక్తం అవుతోంది. దీనిపై హాకీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.. ఆదివారం భారత్ – గ్రేట్ బ్రిటన్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్స్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడంతో పెనాల్టీ షూట్ అవుట్ వరకు వచ్చింది. పెనాల్టీ షూట్ అవుట్ కు ముందుకు గ్రేట్ బ్రిటన్ గోల్ కీపర్ కు కోచింగ్ ఇవ్వడాన్ని భారత హాకీ ఫెడరేషన్ తప్పుపడుతోంది. అంతేకాదు గ్రేట్ బ్రిటన్ గోల్ కీపర్ వీడియో టాబ్లెట్ వినియోగించడం సరికాదంటూ హాకీ ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ” మా జట్టుతో గ్రేట్ బ్రిటన్ తలపడిన తీరు ఏమాత్రం బాగోలేదు. హ్యాండిల్ చేసిన విధానం కూడా సరిగ్గా లేదు. ఇది మా ఆందోళనకు కారణం అవుతోందని” హాకీ ఇండియా చెబుతోంది.

రెడ్ కార్డు ఇచ్చారు

ఈ మ్యాచ్లో భాగంగా గ్రేట్ బ్రిటన్ ఆటగాడు విలియం కాల్నన్ ముఖంపై భారత జట్టు ఆటగాడు అమిత్రోహిదాస్ స్టిక్ తగిలింది. దీంతో అమిత్ కు అంపైర్లు రెడ్ కార్డు ఇచ్చి మైదానం నుంచి బయటికి పంపించారు. ఫలితంగా భారత జట్టు పదిమంది ఆటగాళ్లతోనే 40 నిమిషాల పాటు మ్యాచ్ అడాల్సి వచ్చింది. అయితే భారత జట్టు ఆటగాడు హర్మన్ ప్రీత్ సింగ్ తొలి గోల్ చేయడంతో గ్రేట్ బ్రిటన్ పై లీడ్ సాధించింది. ఇదే క్రమంలో గ్రేట్ బ్రిటన్ గోల్ చేసింది. దీంతో మ్యాచ్ సగం సమయం ముగిసే వరకు రెండు జట్లు 1-1 తో సమానంగా నిలిచాయి.

షూట్ ఔట్ అనివార్యమైంది

మ్యాచ్ ముగిసే సమయానికి కూడా రెండు జట్లు మరో గోల్ సాధించలేకపోయాయి.. దీంతో షూట్ అవుట్ అనివార్యమైంది. ఇదే క్రమంలో భారత గోల్ కీపర్ శ్రీజేష్ రెండు గోల్స్ ను అద్భుతంగా అడ్డుకున్నాడు. దీంతో భారత విజయం సాధించింది. ఆట ముగిసిన అనంతరం అంపైరింగ్ కు భారత జట్టు హాకీ సమాఖ్య అధికారులకు ఫిర్యాదు చేసింది. కీలక సమయంలో అంపైరింగ్ చేసిన విధానం చెత్తగా ఉందంటూ వెల్లడించింది. తమ విజయం పై ప్రభావం చూపించేలాగా కొన్ని సందర్భాల్లో అంపైర్లు ఇబ్బంది పెట్టారని జట్టు సభ్యులు వివరించారు. ముఖ్యంగా వీడియో అంపైరింగ్ రివ్యూలు సరిగ్గా లేవని, అమిత్ రోహిదాస్ కు రెడ్ కార్డ్ జారీ చేసిన విధానం చండాలంగా ఉందని, వీడియో రివ్యూ సిస్టం కూడా లోప భూయిష్టంగా ఉందని ఫిర్యాదు చేసింది. షూట్ అవుట్ సమయంలో గ్రేట్ బ్రిటన్ గోల్ కీపర్ వీడియో టాబ్లెట్ ను వినియోగించడానికి ప్రధానంగా ఫిర్యాదులో భారత హాకీ సమాఖ్య ప్రస్తావించింది.. అయితే దీనిపై ఒలింపిక్ నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది..

సెమీస్ వెళ్లిన టీమిండియా

అయితే ఈ మ్యాచ్ గెలవడం తో టీమిండియా సెమీస్ వెళ్ళిపోయింది. హాకీ జాతీయ క్రీడ అయినప్పటికీ.. గత కొన్ని సంవత్సరాలుగా ఒలింపిక్స్ లో భారత్ స్థిరమైన ప్రదర్శన చేయలేకపోతోంది. అయితే ఈసారి గత వైఫల్యాలకు చెక్ పెడుతూ భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. వరుస విజయాలు సాధించి సెమీస్ వెళ్లిపోయారు. సెమీస్ లోనూ గెలిస్తే భారత జట్టుకు మెడల్ గ్యారెంటీ. అయితే గ్రేట్ బ్రిటన్ పై విజయం సాధించిన నేపథ్యంలో భారత హాకీ జట్టు పై ప్రశంసల జల్లు కురుస్తోంది.