Private Tech Country: ఐటీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసిస్తోంది. ప్రపంచ టెక్నాలజీ రంగానికి ఐటి పరిశ్రమనే ఊపిరి లూదుతోంది. సాధారణంగా ఐటీ పరిశ్రమ పేరు చెప్తే అమెరికాలో సిలికాన్ వ్యాలీ, బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, హైదరాబాదులో సైబరాబాద్ వంటి ప్రాంతాలు గుర్తుకొస్తాయి.. ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా ఐటీ పరిశ్రమకు రాజధాని లాంటి నగరాలు చాలా ఉన్నాయి. అయితే ఐటీ పరిశ్రమకు భారీ భవనాలతో పాటు.. అతిపెద్ద బ్యాకప్ సెంటర్లు కూడా కావాలి. పైగా ఇవి ఏర్పాటు చేసే ప్రాంతాలు ప్రకృతి విపత్తులు చోటు చేసుకోకుండా ఉండాలి. అందువల్లే ప్రకృతి విపత్తులు ఏమాత్రం చోటుచేసుకుని ప్రాంతాలలోనే ఐటి పరిశ్రమలు పెద్ద ఎత్తున కార్యాలయాలను నిర్మిస్తాయి. అయితే ఐటి పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని నగరాలలో మాత్రమే ప్రత్యేకమైన ప్రాంతాలు ఉన్నాయి. ఐటీ పరిశ్రమల కోసం.. ఐటీ ఉద్యోగుల కోసం.. ఐటీ కంపెనీల కోసం ప్రత్యేకంగా దేశాలు లేవు. అయితే ఇప్పుడు కేవలం ఐటీ ఉద్యోగుల కోసమే ఓ వ్యక్తి ఒక దేశాన్ని నిర్మిస్తున్నాడు. ఆ వ్యక్తి భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం.
Also Read: అర్హులకే రూ.4 లక్షలు.. ఎవరికి ఇస్తామో వెల్లడించిన సీఎం రేవంత్‌రెడ్డి!
భారతీయ మూలాలు ఇండి అమెరికాలో స్థిరపడిన బాలాజీ శ్రీనివాసన్ ఒక ఎంటర్ ప్రెన్యూర్.. ఇతడు బిట్ కాయిన్ ఉపయోగించి సింగపూర్ లోని ఓ ప్రాంతంలో ప్రైవేట్ దీవి కొనుగోలు చేశాడు. ఆ దీవిలో శాస్త్ర సాంకేతిక రంగాల ఆధారంగా పనిచేసే స్టార్టప్ నిర్వాహకులు.. డిజిటల్ నోమాడ్స్.. డెవలపర్లు.. క్రియేటర్ల కోసం దేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు బాలాజీ శ్రీనివాసన్.. బాలాజీ శ్రీనివాసం స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో డాక్టరేట్ చేశారు. అంతేకాదు జెనెటిక్ టెస్టింగ్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అనంతరం క్రిప్టో కరెన్సీ కంపెనీలో సీటీవో గా పని చేశారు. బాలాజీ శ్రీనివాసన్ తల్లిదండ్రులు తమిళనాడులో వైద్యులుగా సాగుతున్నారు.. బాలాజీ శ్రీనివాసన్ కు ఒక నెట్వర్క్ స్టేట్ ను ఏర్పాటు చేయాలని కోరిక ఉండేది. నెట్వర్క్ స్టేట్ అంటే ఇంటర్నెట్ ఆధారంగా నెలకొల్పిన ఒక సమాజం. అయితే అటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి బాలాజీ శ్రీనివాసం ఏకంగా ఒక దీవిని కొనుగోలు చేయడం విశేషం. మరోవైపు దీనిని బిట్ కాయిన్ సహాయంతో ఆయన కొనుగోలు చేయడం విశేషం.. ఇక ఈ నెట్వర్క్ స్టేట్ మలేషియాలోని ఫారెస్ట్ సిటీ, సింగపూర్ దేశానికి సమీపంలో ఉంది.
Also Read: మీకు బైక్ నడపడం వచ్చా.. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా.. అయితే ఈ సమాచారం మీకోసమే..!
నెట్వర్క్ స్టేట్ అనేది టెకీ లకు స్వర్గధామం లాగా ఉంటుంది. విభిన్నమైన ఆలోచనలు ఉండే యువతకు ఇది అవకాశాల పుట్ట లాంటిది. స్టార్టప్, కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ రంగాలలో పనిచేసే వారికి ఇది విభిన్నమైన ప్రపంచం. ఇక్కడ పని ఆన్లైన్లో ఉంటుంది. జీవితం ఆఫ్ లైన్లో సాగుతుంది. పైగా ఇదంతా కూడా ఒక డిజిటల్ సమాజం. ఇక్కడ ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఆచరణత్మకంగా పనిచేసే ప్రగతిశీల వ్యక్తులకు ఇది ఒక అద్భుతమైన వేదిక లాంటిది. ప్రస్తుతం ఇక్కడ మూడు నెలల శిక్షణ శిబిరం ప్రారంభమైంది.. ఇందులో టెక్నాలజీ నిపుణులు.. పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేయిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తారు. విభిన్నమైన కోర్సులను నేర్పిస్తారు.. అయితే ఈ దీనికి బాలాజీ స్టాండ్ ఫోర్డ్ ఆన్ యాన్ ఐలాండ్ అనే పేరు పెట్టాడు. అంటే సముద్రం మధ్యలో ఉన్న స్టాన్ఫోర్డ్ లాంటి స్మార్ట్ ప్రదేశం అని దీనిని బాలాజీ శ్రీనివాసన్ పిలుస్తున్నాడు..