Justin Trudeau: ఆ చిచ్చు దహించేది ఆ దేశాన్నే.. కెనడాకు చేటు చేస్తున్న ప్రధాని ట్రూడో!

భారత్‌ను ప్రపంచ వేదికపై దోషిగా నిలబెట్టాలని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రయత్నాలు చేస్తోంది. దీనికి పాశ్చాత్య దేశాలు మద్దతు పలుకుతున్నాయి. కానీ ట్రూడో చేస్తున్న తప్పిదం ఆదేశానికే ముప్పుగా మారనుంది.

Written By: Raj Shekar, Updated On : November 5, 2024 2:43 pm

Justin Trudeau

Follow us on

Justin Trudeau: కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో.. భారత దేశంపై చేస్తున్న కుట్రలతో ఏదో సాధించానని అనుకుంటున్నారు. ఇప్పటికే సిక్కు వేర్పాటు వాది, ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్యను అడ్డు పెట్టుకుని భారత ఏజెంట్లపై ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. సాక్షాలు లేవని అంగీకరిస్తూనే భారత్‌ టార్గెట్‌గా విదేశాలకు లీకులు ఇస్తున్నాయి. ఇక భారత ఎదుగుదలను ఓర్వలేని దేశాలు.. ఈ లీకులతో ఎంజాయ్‌ చేస్తున్నాయి. ట్రూడో తీరుకు మద్దతు పలుకుతున్నాయి. దీంతో ట్రూడో మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు.. అక్కడి హిందూ ఆలయంపై దాడిచేసినా పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఈ చర్యలో భారతీయుల మధ్య చిచ్చు పెట్టానని అనుకుంటున్నారు. కానీ, ఆ నిప్పు చివరకు కెనడాకే ముప్పుగా మారుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్‌తో పెట్టుకున్న ఏ దేశం బాగు పడలేదు. పాకిస్తాన్, మాల్దీవులు ఇప్పటికే అడుక్కుతింటున్నాయి. ఈ జాబితాలో కెనడా చేరే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొంటున్నారు.

ఖలిస్తానీలను ఎగదోస్తూ..
ట్రూడో కెనడాలోని ఖలిస్తానీ అనుకూలవాదులను ఎగదోస్తున్నారు. హిందువులపై దాడిని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా జరిపిన దాడికి ట్రూడో అనుమతి ఉందన్న ప్రచారం జరగుతోంది. ఆయన మద్దతు లేకుండా ఇలాంటి జాతి వివక్ష ఘటనలు జరగవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హిందువులను ఖలిస్థానీలకు శత్రువుగా చూపడం వెనుక కారణం తెలియడం లేదు. ఖలిస్థానీ విషంలో హిందువులు జోక్యం చేసుకోలేదు. కానీ సిక్కుల్లోనే ఖలిస్థానీ ఉద్యమాన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు. మాఫియా, నేర సామ్రాజ్యం, నేరపూరిత వ్యాపరం చేసేవారు ఖలిస్థానీ వాదులుగా ఉన్నారు. వీరికి కెనడా ప్రభుత్వం మద్దతు ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

పాములకు పాలు పోస్తే..
పాము విషపూరిత జంతువు.. దానికి పాలుపోసి పెంచినా.. కాటు వేయక మానదు. ఇది ప్రపంచంలో చాలా దేశాల విషయంలో నిరూపితమైంది. గ్రవాదాన్ని పెంచి పోసించిన పాకిస్తాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, లెబనాన్, ఇరాన్‌ తదితర దేశాలు ఇప్పుడు ఉగ్రవాదంతోనే ఇబ్బంది పడుతున్నాయి. యుద్ధాలు కోరి తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు ఖిలిస్థానీని పెంచి పోసిస్తున్న కెనడా భవిష్యత్‌లో ఇదే టెర్రరిజంతో ఇబ్బంది పడడం ఖాయం. ట్రూడో కేవంలం తన పదవిని కాపాడుకోవడానికి చేస్తున్న చర్యలు.. భవిష్యత్‌లో ఆ దేశానికి పెను ముప్పుగా మారతాయని విదేశీ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.