https://oktelugu.com/

Pushpa 2: ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్టర్!

ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ కి సౌత్ ఇండియా లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. కంటెంట్ తో సంబంధం లేకుండా కేవలం తన యాక్టింగ్ టాలెంట్ తో సినిమాలను మరో లెవెల్ కి తీసుకెళ్తున్నాడు ఫహాద్ ఫాజిల్.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 02:49 PM IST

    Pushpa 2(6)

    Follow us on

    Pushpa 2: సరిగ్గా ఈరోజు నుండి నెల రోజుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈనెల మొత్తం ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ దేశవ్యాప్తంగా గ్రాండ్ గా ప్లాన్ చేసారు మేకర్స్. ముందుగా ప్రొమోషన్స్ ని నార్త్ ఇండియా నుండి ప్రారంభించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేయబోతున్నారు. అమరావతి లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథి గా విచ్చేయబోతున్నాడని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇది ఇలా ఉండగా నేడు ఈ చిత్రం నుండి మేకర్స్ సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. అల్లు అర్జున్ , ఫహాద్ ఫాజిల్ ఫేస్ ఆఫ్ ఫోజులో ఉన్నటువంటి ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 1 లో చివరి 20 నిమిషాలు కనిపించిన ఫహాద్ ఫాజిల్, పార్ట్ 2 లో సినిమా మొత్తం కనిపించనున్నాడు.

    ఆయన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయట. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ కి సౌత్ ఇండియా లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. కంటెంట్ తో సంబంధం లేకుండా కేవలం తన యాక్టింగ్ టాలెంట్ తో సినిమాలను మరో లెవెల్ కి తీసుకెళ్తున్నాడు ఫహాద్ ఫాజిల్. అలాంటిది ఆయన అల్లు అర్జున్ తో కలిసి పూర్తి స్థాయి సినిమాలో నటిస్తే ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని వచ్చే వారం విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ వారం ఐటెం సాంగ్ ని షూట్ చేయబోతున్నారు. ఐటెం సాంగ్ కోసం అనేక మంది హీరోయిన్లను సంప్రదించారు కానీ చివరికి శ్రీలీల ఫిక్స్ అయ్యింది. ఇటీవల కాలంలో ఈమె కొన్ని ఇంటర్వ్యూస్ లలో మీకు ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వస్తే చేస్తారా అని అడిగినప్పుడు, అసలు చేయను, నాకు ఆసక్తి లేదు అని చెప్పింది. అలాంటిది ‘పుష్ప 2’ లో ఐటెం సాంగ్ చేయడానికి ఎలా ఒప్పుకుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

    అయితే శ్రీలీల సాధారణ కమర్షియల్ సినిమా లో ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకునేది కాదేమో, కానీ పుష్ప 2 పాన్ ఇండియన్ సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా. అంత పెద్ద సినిమాలో చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ఇష్టపడరు, అలాంటిది ఒక మంచి మాస్ బీట్ ఉన్న ఐటెం సాంగ్ లో కనిపించే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటారు అని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. సమంత కి నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి పుష్ప పార్ట్ 1 లో చేసిన ఐటెం సాంగ్. ఇప్పుడు శ్రీలీల కి కూడా అలాంటి క్రేజ్ వస్తుందేమో చూడాలి. ఇది ఇలా ఉండగా ‘గేమ్ చేంజర్’ టీజర్ విడుదలైన రెండు రోజులకు ‘పుష్ప 2’ వచ్చే అవకాశం ఉందని కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.