PM Modi: మాస్కో లో వాళ్లు చేసిన పనికి ఫిదా అయినా ప్రధాని మోడీ

అనంతరం ఆస్ట్రియా బయల్దేరే ముందు మోదీ... రష్యాలోని భారతీయులతో సమావేశమయాయరు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. 140 కోట్ల మంది ప్రేమను తీసుకుని రష్యాకు వచ్చినట్లు చెప్పి ఆకట్టుకున్నారు. భారత అభివృద్ధి, రాబోయే ఐదేళ్ల లక్ష్యాలను వివరించారు. అనంతరం ప్రవాస భారతీయులను పలు ప్రశ్నలడిగి వారితో ఉత్సాహంగా ముచ్చటించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 10, 2024 10:02 am

PM Modi

Follow us on

PM Modi: ప్రధాని మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజులు పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. జూలై 8న రష్యా వెళ్లిన ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. తొలిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, రెండో రోజు అదేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశమయ్యారు. ప్రైవేటు లంచ్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్‌తో యుద్ధంపైనా సూచనలు చేశారు. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను పంపించాలని కోరారు.

భారతీయులతో సమావేశం..
అనంతరం ఆస్ట్రియా బయల్దేరే ముందు మోదీ… రష్యాలోని భారతీయులతో సమావేశమయాయరు. వారిని ఉద్దేశించి మాట్లాడారు. 140 కోట్ల మంది ప్రేమను తీసుకుని రష్యాకు వచ్చినట్లు చెప్పి ఆకట్టుకున్నారు. భారత అభివృద్ధి, రాబోయే ఐదేళ్ల లక్ష్యాలను వివరించారు. అనంతరం ప్రవాస భారతీయులను పలు ప్రశ్నలడిగి వారితో ఉత్సాహంగా ముచ్చటించారు.

కళాకారులతో మాటామంతి..
ఇక తనకు స్వాగతం పలికేందుకు ప్రదర్శించిన రష్యన్‌ కల్చరల్‌ ట్రూప్‌ కళాకారులతో ప్రధాని మోదీ సంభాషించారు. మాస్కోలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి చేసే ప్రసంగానికి ముందు త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భారతీయులు చప్పట్లు, ‘మోదీ మోదీ‘ నినాదాలతో హెూరెత్తించారు. అనంతరం తన ప్రసంగంలో మోదీ ఒక శుభవార్తను పంచుకున్నారు. రష్యాలో కొత్త కాన్సులేట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కజాన్, యెకటెరిన్‌బర్గ్‌లలో భారత కాన్సులేట్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది పర్యాటకం, వ్యాపార వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.

కళాకారులతో కబుర్లు..
ఇక కళాకారులతో మాట్లాడుతూ ఎన్నాళ్లనుంచి డ్యాన్స్‌ నేర్చుకుంటున్నారని అని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది పదేళ్లు, మరికొంతమంది 30 ఏళ్లు అని సమాధానమిచ్చారు. కొంతమంది భారతదేశంతో, మోదీతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇస్కాన్‌ మాస్కో ప్రెసిడెంట్, సాధు ప్రియా దాస్, రామకృష్ణ మిషన్‌ నుంచి స్వామి ఆత్మాలోకానంద తదితరులు మాట్లాడారు.