https://oktelugu.com/

Vedaa Movie: వేద సినిమాతో జాన్ అబ్రహం బాలీవుడ్ ను ఆడుకుంటాడా..?

Vedaa Movie: నిజానికి ఆగస్టు 15 న పుష్ప 2 సినిమా వస్తుందనే ఉద్దేశ్యం తో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకుందామని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల పుష్ప 2 ఆగస్టు 15 నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు మేకర్స్ వేద సినిమాని థియేటర్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 10, 2024 / 10:00 AM IST

    john abraham vedaa

    Follow us on

    Vedaa Movie: బాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇప్పుడు ఒక్క సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ లో కండల వీరుడు గా పేరుపొందిన ‘జాన్ అబ్రహం’ సైతం ప్రస్తుతం ఒక హిట్టు కోసం కండ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన వేద అనే సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని ఆగష్టు 15వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    నిజానికి ఆగస్టు 15 న పుష్ప 2 సినిమా వస్తుందనే ఉద్దేశ్యం తో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకుందామని అనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల పుష్ప 2 ఆగస్టు 15 నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు మేకర్స్ వేద సినిమాని థియేటర్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆ రోజే ‘సింగం ఏగైన్’ అనే సినిమా కూడా వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక మొత్తానికైతే ‘వేద ‘ సినిమాతో జాన్ అబ్రహం ఒక భారీ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. మరి దానికి అనుకూలంగానే ఆయన సక్సెస్ కొడతాడా లేదంటే చతికలాపడిపోతాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ఈ సంవత్సరం బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించడం లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో జాన్ అబ్రహం రిలీజ్ చేస్తున్న వేద సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే కల్కి సినిమా వచ్చి ఓవరాల్ గా భారీ వసూళ్లను రాబడుతోంది.

    మరి అంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మరొక మెట్టు పైకి ఎక్కించిందనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమం లో బాలీవుడ్ హీరోల క్రేజ్ అనేది రోజురోజుకి పడిపోతుంది. మరి అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీ కి వేద సినిమా ఎంతవరకు సక్సెస్ ను అందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది..