Steven Spielberg: హాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న దర్శకులు ఎక్కువ గా గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ ఉంటారు. నిజానికి ప్రపంచంలో ఉన్న అన్ని ఇండస్ట్రీల కంటే కూడా హాలీవుడ్ ఇండస్ట్రీనే పెద్దది. ఇక అక్కడ ఉన్న టెక్నాలజీని వాడుకొని అక్కడి దర్శకులు వండర్స్ చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ‘స్టీవెన్ స్పీల్ బర్గ్’ హాలీవుడ్ ఇండస్ట్రీ మీద తన సినిమాలతో ఒక చెరగని ముద్రవేశాడనే చెప్పాలి.
ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే కాకుండా విజువల్ వండర్ గా తెరకెక్కడం విశేషం. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఒక కొత్త సినిమాని కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా మొత్తం స్పేస్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ బ్యాక్ డ్రాప్ తో ఇప్పటివరకు చాలా సినిమాలు తెరకెక్కినప్పటికీ ఈయన ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తగా ఉంటుందని హాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలైతే వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాకి ఇంకా పేరైతే పెట్టలేదు. కానీ తొందర్లోనే ఈ సినిమాతో ఆయన ఒక వరల్డ్ రికార్డు కూడా సాధించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక 2026 వ సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక స్పిల్ బర్గ్ గతంలో ఇండియానా జోన్స్, జురాసిక్ పార్క్ లాంటి భారీ సినిమాలను తీసి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. అందుకే స్టీవెన్ స్పీల్ బర్గ్ పేరు చెప్తే ప్రపంచం మొత్తం లో ఉన్న సినిమా అభిమానులందరూ ఆయన సినిమాలకి ఫిదా అయిపోతుంటారు. ఇక ఆయన ఇన్స్పిరేషన్ తో చాలా దేశాల్లో చాలామంది దర్శకులుగా మారి సక్సెస్ ఫుల్ దర్శకులుగా కొనసాగుతున్నారు. ఇక మన స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళికి కూడా ఆయన అంటే చాలా ఇష్టం…
ఇక ఆయన సినిమాలను చాలా ఎక్కువగా చూస్తూనే తన బాల్యం అంతా గడిపినట్టుగా రాజమౌళి ఒక సందర్భం లో తెలియజేశాడు. ఇక ఇప్పుడు రాజమౌళి కూడా స్పిల్ బర్గ్ తీసిన ఇండియానా జోన్స్ సినిమా ఇన్స్పిరేషన్ తోనే మహేష్ బాబు సినిమా చేస్తుండటం విశేషం…