https://oktelugu.com/

Nepal : డార్లింగ్ అంటే ఎంత అభిమానమో.. ఏకంగా వారి ఊరి పేరు ప్రభాస్ అని పెట్టుకున్నారు.. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడుందంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) కు ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి సినిమా ద్వారా అతని రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అతడు నటిస్తున్న ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతోంది. వందల కోట్లు వసూలు చేస్తోంది. ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. మరో మూడు సంవత్సరాల వరకు అతని కాల్ షీట్లు లభించని పరిస్థితి నెలకొంది.

Written By: , Updated On : February 25, 2025 / 02:14 PM IST
Village Name Prabhas in Nepal

Village Name Prabhas in Nepal

Follow us on

Nepal  : ప్రభాస్ పుట్టింది భీమవరంలో. భీమవరంలో ప్రభాస్ సినిమా విడుదల అయితే వేడుకలు ఒక రేంజ్ లో జరుగుతాయి. ఆ మధ్య కృష్ణంరాజు కాలం చేసినప్పుడు.. ప్రభాస్ తన అభిమానుల కోసం భీమవరంలో భోజనాలు పెట్టించాడు. చికెన్, దూపుడుపోతు బిర్యాని, మటన్, ఫిష్, ప్రాన్స్, ఇక శాఖాహారంలోనూ పదుల కొద్దీ రకాలతో భోజనాలు పెట్టించాడు. దాదాపు భోజనాలకే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చైనట్టు తెలుస్తోంది. ఈ భోజనాలకు దాదాపు లక్షల్లో అభిమానులు వచ్చారని తెలుస్తోంది. కృష్ణంరాజు వారసుడిగా ప్రభాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నాడు. కృష్ణంరాజును మించి ఎదిగిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న ప్రతి సినిమా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.. ప్రభాస్ అంటే చెవి కోసుకునేవారు.. వెర్రి అభిమానం చూపించేవారు చాలామంది ఉంటారు. అయితే ఓ గ్రామం వారు మాత్రం తమ ఊరి పేరు ప్రభాస్ అని పెట్టుకున్నారు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.

ప్రభాస్ అనే ఊరు మనదేశంలో లేదు. మనకు పక్కనే ఉన్న నేపాల్ దేశంలో ఉంది. తెలుగు మోటో వ్లాగర్ నేపాల్ పర్యటనలో ఉండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ పేరుతో ఒక ఊరు ఉందంటూ అతడు వీడియో షేర్ చేశాడు. అయితే ప్రభాస్ కు, ఆ గ్రామానికి సంబంధం లేదని ఆ వ్లాగర్ స్పష్టం చేశాడు. అయితే మన దేశంలో సెలబ్రిటీల పేర్లతో ఊర్లు మాత్రమే కాకుండా రైల్వే స్టేషన్లు ఉండడం విశేషం. సచిన్, కోహ్లీ పేరుతో రైల్వేస్టేషన్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ప్రభాస్ కూడా చేరిపోయాడు.. ప్రభాస్ పేరుతో ఏకంగా ఒక ఊరు ఉండడంతో డార్లింగ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..” బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అతడి పేరుతో ఒక ఊరు ఉందని తెలియడం ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రభాస్ అభిమానులుగా ఇది మాకు గర్వించే విషయం. ఒక హీరో పేరుతో ఊరు ఉండడం బహుశా ప్రభాస్ కు మాత్రమే దక్కిన గౌరవం. ప్రభాస్ మరింత పేరు తెచ్చుకోవాలి.. గొప్ప కథానాయకుడిగా వెలుగొందాలి. అతడి సినిమాలు ఇంకా ఎక్కువ జనాదరణ పొందాలి. అతని స్థాయి హాలీవుడ్ దాకా ఎదగాలని” ప్రభాస్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.