Who is Ahmed Al Ahmed: సిడ్నీ లోని బోండీ బీచ్ లో ఇద్దరు తండ్రి కొడుకులు యూదుల మీద కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది.. అయితే కాల్పులకు పాల్పడుతున్న వ్యక్తుల్లో ఒకరిని అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి అడ్డుకున్నాడు.. అతడిని నిరాయుదుడిని చేశాడు. తద్వారా చాలా వరకు ప్రాణనష్టాన్ని తగ్గించాడు.
ఈ ఘటన జరిగిన తర్వాత అహ్మద్ ఒకసారిగా అంతర్జాతీయ హీరో అయిపోయాడు. ఆస్ట్రేలియా ప్రజల ప్రాణాలను కాపాడిన అతడి వీరత్వానికి గొప్ప గుర్తింపు ఇవ్వాలని ప్రముఖ యూద్ బిలియనీర్ విలియం అక్మాన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గో ఫండ్ మీ కి అతడు 99 వేల 999 డాలర్లను ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా అహ్మద్ ఏదైనా ఇవ్వాలని ఆసక్తి అందరిలో కలిగింది. అహ్మద్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ డాలర్లు విరాళంగా వచ్చాయి.. అక్మాన్ 99, 999 డాలర్లను విరాళంగా ప్రకటించిన తర్వాత.. ప్రపంచ వ్యాప్తంగా ఒకసారిగా ఆసక్తి పెరిగింది.
అహ్మద్ సిడ్నీ నగరంలో పండ్ల వ్యాపారిగా ఉన్నాడు.. అతడు ఆదివారం జరిగిన బోండీ బీచ్ ఘటనలో సాయుధుడైన వ్యక్తిని పట్టుకున్నాడు. ప్రాణనష్టాన్ని తగ్గించాడు. యూదుల పండుగ నాడు ప్రాణ నష్టం సంభవించకుండా ఆపగలిగాడు. ఇది అక్మాన్ ను కదిలించింది. స్వయంగా యూదుడైన అతడు గో ఫండ్ మే లో అహ్మద్ కోసం 99,999 డాలర్లు విరాళం గా ప్రకటించాడు.. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అహ్మద్ కోసం వన్ మిలియన్ డాలర్ల వరకు వచ్చాయి. ఇంకా విరాళాలు వస్తూనే ఉన్నాయి..” ప్రపంచ వ్యాప్తంగా శాంతి కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారు.. ఆ పోరాటానికి ప్రతిఫలమే ఇంతటి విరాళాలు. అహ్మద్ పండ్ల వ్యాపారి అయినప్పటికీ.. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఇద్దరు దుర్మార్గులకు వ్యతిరేకంగా ముందుకు వెళ్లాడు.. ప్రజల ప్రాణాలను కాపాడాడు. అంతటి గొప్ప వ్యక్తికి ఎంత సహాయం చేసిన తక్కువేనని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
BREAKING NEWS: Over $1 million raised so far for the Sydney hero. A GoFundMe was set up for the man who stopped the attacker and saved many lives.
Bill Ackman also donated ~$100,000. pic.twitter.com/vce2Mp7QjZ
— DogeDesigner (@cb_doge) December 15, 2025