Who is William Ackman: ఒక మంచి పని చేస్తే ఎవరినైనా సరే అభినందిస్తాం.. ఎందుకంటే మంచి అనేది సమాజాన్ని సానుకూల దృక్పథం వైపు తీసుకెళ్తుంది. అది చాలామంది మనుషుల మనస్తత్వాలను మార్చేస్తుంది. ప్రపంచాన్ని సరికొత్త దిశగా వెళ్లేలా చేస్తుంది. ప్రపంచాన్ని మార్చగలిగే సానుకూల దృక్పధం ఉన్న మనుషులకు రకరకాల అవార్డులు ఇస్తుంటారు. వివిధ రకాల పురస్కారాలు ఇస్తుంటారు. ముఖ్యంగా యుద్ధాలను ఆపగల శక్తి ఉన్న వ్యక్తులకు శాంతి బహుమతులు ఇస్తుంటారు.. ఎందుకంటే ఈ పురస్కారాలు ఆ వ్యక్తుల గౌరవాన్ని మరింత పెంచుతాయి. సమాజాన్ని మరింత జాగృత పరుస్తాయి.
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ లో ఇద్దరు ఉన్మాదులైన తండ్రి కొడుకులు యూదులపై కాల్పులకు పాల్పడ్డారు.. అయితే అందులో ఒక అతనిని సిడ్ని నగరానికి చెందిన పండ్ల వ్యాపారి అహ్మద్ అల్ అహ్మద్ అడ్డుకున్నాడు. అతడు చూపించిన ధైర్యం వల్ల ప్రాణ నష్టం తప్పిపోయింది. అహ్మద్ చూపించిన ధైర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటాలని.. అతడికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఇవ్వాలని ప్రముఖ వ్యాపారవేత్త విలియం అక్మాన్ భావించాడు. అహ్మద్ కోసం గో ఫండ్ మీ అనే సంస్థ ద్వారా 99,999 డాలర్ల విరాళం ప్రకటించాడు.. అప్పటినుంచి ప్రపంచవ్యాప్తంగా అహ్మద్ కోసం విరాళాలు వచ్చాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా అహ్మద్ కోసం వన్ మిలియన్ డాలర్లు విరాళాల రూపంలో వచ్చాయి.
అహ్మద్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇలా విరాళాలు రావడానికి ప్రధాన కారణం అక్మాన్ అనే వ్యాపారవేత్త.. ఇతడు కూడా యూదు జాతికి చెందిన వాడు. అక్మాన్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల ఇజ్రాయిల్ దేశానికి బహిరంగంగా మొదటి ప్రకటించారు. అంతేకాదు యాంటీ సెమిటిజానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. 2004లో ఇతడు పెర్షింగ్ స్క్వేర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే సంస్థను స్థాపించాడు. ప్రస్తుతం ఆ సంస్థకు సీఈఓ కొనసాగుతున్నాడు. ఈ కంపెనీ ఆస్తుల విలువ దాదాపు 20 బిలియన్ డాలర్లు.. చి పోటీలు, ఉబర్, అమెజాన్ వంటి పది కంపెనీలకు కేంద్రీకృత ఈక్విటీ పోర్ట్ పోలియోను ఈ సంస్థ నిర్వహిస్తుంది.
అక్మాన్ కు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. ట్విట్టర్ లో ఇతడిని రెండు మిలియన్లకు పైగా నెటిజన్లు అనుసరిస్తున్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థులను కాకుండా ట్రంప్ కు జై కొట్టాడు. ది జెరూసలేం పోస్ట్ ప్రకారం 2024 లో అత్యంత ప్రభావంతమైన యూదుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. పోర్బ్స్ డిసెంబర్ 14, 2025 నివేదిక ప్రకారం అక్మాన్ నికర విలువ 9.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సంపద ద్వారా అతడు ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాలో 345వ స్థానంలో ఉన్నాడు. ఇతడి సంపద ప్రధానంగా పెర్షింగ్ స్క్వేర్ క్యాపిటల్ మేనేజ్మెంట్ లో ఉంది. ఇతడి భార్య పేరు బిల్ అక్మాన్. ఈమె ఇజ్రాయిల్ లో జన్మించింది. ఆర్కిటెక్ట్, కంప్యూటేషనల్ డిజైనర్ గా కొనసాగుతోంది.