PMSBY 2 Lakh Insurance Policy: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి బీమా సురక్ష యోజన స్కీమ్ ద్వారా ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ స్కీం చాలా తక్కువ ఖర్చుతో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రజలకు అందిస్తుంది. ఇందులో కేవలం రూ.20 రూపాయల ప్రీమియంతో ఏడాదికి రెండు లక్షల కవరేజీని అందిస్తుంది. పేద మరియు నిరుపేద కుటుంబాలు ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియం భరించలేని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని తక్కువ ప్రీమియంతో ఈ స్కీమ్ ని అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భీమ సురక్ష యోజన పథకాన్ని 2015 లో మొదలు పెట్టింది. ఇది ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత వైకల్యం కలిగిన కూడా వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలుస్తుంది. ఇప్పటివరకు లక్షలాది మంది భారతీయులకు ఇది యాక్సిడెంట్ కవర్ అందజేసింది.
ఇటువంటి ఆస్పత్రి ఖర్చులు కూడా ఈ పథకం ద్వారా తిరిగి రావు. కేవలం ఏదైనా యాక్సిడెంట్లో మరణించిన లేదా శాశ్వతంగా వైకల్యం సంభవించిన వాళ్లకు మాత్రమే ఈ కవరేజ్ క్లైమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకం పాలసీదారుడు ఏదైనా యాక్సిడెంట్ లో ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వాళ్ళ నామినీకి రెండు లక్షల రూపాయలు అందుతాయి. ఒకవేళ ప్రమాదవశాత్తు పూర్తిగా వైకల్యానికి గురైన కూడా వారి కుటుంబానికి రెండు లక్షలు అందజేస్తారు. ఒకవేళ యాక్సిడెంట్ లో పాలసీదారుడు పాక్షిక వైకల్యానికి గురైనట్లయితే వారికి ఒక లక్ష రూపాయలు ఇస్తారు. ఏదైనా ప్రమాదంలో ఒక వ్యక్తి రెండు కళ్ళు పూర్తిగా కోల్పోయిన లేదా రెండు చేతులు, రెండు కాళ్లు కోల్పోయిన కూడా దానిని శాశ్వత వైకల్యంగా పరిగణిస్తారు. ఒక కాలు లేదా ఒక చెయ్యి, కంటి చూపు కోల్పోతే దానిని పాక్షికవైకల్యంగా పరిగణిస్తారు.
Also Read: బ్యాంక్ అకౌంట్ రూ.12 ఉన్నాయా.. లేదంటే రూ.2 లక్షలు నష్టం..?
కేంద్ర ప్రభుత్వం ఈ స్కీం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు ఊహించని విషాదాల నుంచి బయటపడడానికి లేదా ఇతర వైద్య ఖర్చులకు ఉపయోగపడుతుంది. 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్న భారతీయ పౌరులు ఈ పథకానికి అర్హులు. దీనికి సంబంధించిన ప్రీమియం ప్రతి ఏడాది కూడా ఆటోమేటిక్గా డెబిట్ చేయబడుతుంది. దీనికి మీకు ఖచ్చితంగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. ఈ పథకం కింద బీమా కవరేజ్ ప్రతి ఏడాది జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది.