Vishnu hopes on Kannappa : కన్నప్ప మూవీ తరచుగా వార్తల్లో నిలుస్తుంది. ప్రకటన నాటి నుండే ఈ చిత్రంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. సీనియర్ నటుడు కృష్ణంరాజు కెరీర్లో మైలురాయిగా భక్త కన్నప్ప చిత్రం ఉంది. కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలని కృష్ణంరాజు ఆశపడ్డారు. అనూహ్యంగా ఆ సబ్జెక్టుతో మంచు విష్ణు మూవీ ప్రకటించడం, ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేసింది. ట్విస్ట్ ఇస్తూ ప్రభాస్ కన్నప్ప మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారని ప్రకటించారు. ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడని అందరూ భావించారు. శివుడి పాత్ర అక్షయ్ కుమార్ చేస్తున్నారు.
కన్నప్ప మూవీ నుండి వచ్చిన ఫస్ట్ ప్రోమో ట్రోల్స్ కి గురైంది. మంచు విష్ణు శివయ్యా.. అని చెప్పిన డైలాగ్ పై మీమ్స్ వెల్లువెత్తాయి. సింగిల్ మూవీలో శ్రీవిష్ణు ఈ డైలాగ్ స్పూఫ్ చేశాడు. కన్నప్ప టీమ్ ఆగ్రహించడంతో శ్రీవిష్ణు సారీ చెప్పాడు. భైరవం ట్రైలర్ రిలీజ్ వేడుకలో మంచు మనోజ్ సైతం కన్నప్ప మూవీలోని శివయ్యా.. డైలాగ్ పై సెటైర్స్ వేశాడు. కన్నప్ప మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. ఆ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలతో కూడిన హార్డ్ డిస్క్ లను స్టాఫ్ దొంగిలించారు. మంచు మనోజ్ వద్ద పని చేసే వారే ఈ పని చేశారని మంచు మనోజ్ ఆరోపణలు చేశాడు.
Also Read : బ్రాహ్మణులపై మంచు కుటుంబం పగబట్టేసిందా..? మరో వివాదంలో చిక్కుకున్న ‘కన్నప్ప’!
అటు బ్రాహ్మణ సంఘాలు మంచు ఫ్యామిలీ మీద మండిపడుతున్నాయి. కన్నప్ప మూవీలో బ్రహ్మానందం, సప్తగిరి.. పిలక-గిలక అనే పాత్రలు చేశారు. ఈ పాత్రల ద్వారా బ్రాహ్మణులను మంచు ఫ్యామిలీ అవమానపరిచారంటూ వారు ధర్నాలు చేస్తున్నారు. ఆ పాత్రలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచు విష్ణు మాత్రం మూవీ విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. రాజాసాబ్, ఓజీ చిత్రాల బడ్జెట్ కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువైందని అన్నారు. ఓటీటీ డీల్ తిరస్కరించాను అన్న మంచు విష్ణు, హిట్ అయ్యాక ఇస్తామన్న ఫిగర్ కి డీల్ క్లోజ్ చేశాను అన్నాడు. ఒకవేళ హిట్ కాకపోతే ముందుగా ఇస్తాన్న అమౌంట్ కూడా కన్నప్ప కు దొరకదు. అంత రిస్క్ చేశాడట.
ఓ ఇంటర్వ్యూలో కన్నప్ప బడ్జెట్ ఎంత అని అడగ్గా త్రీ నంబర్స్ ఫిగర్ అన్నాడు. 100 కోట్లు కూడా త్రీ నెంబర్స్ ఫిగరే కదా, అని యాంకర్ అడగ్గా.. అంతకంటే చాలా ఎక్కువ అయ్యింది. నేను ఎగ్జాట్ ఫిగర్ చెబితే మా మీద ఐటీ దాడులు జరుగుతాయని అన్నారు. పరోక్షంగా కన్నప్ప బడ్జెట్ రూ. 200-300 అని మంచు విష్ణు హింట్ ఇచ్చాడు. ఓటీటీ డీల్ కూడా రిస్క్ తో క్లోజ్ చేసిన నేపథ్యంలో కన్నప్ప ఆడకపోతే మంచు విష్ణుకు వందల కోట్ల నష్టం తప్పదు. జూన్ 13న కన్నప్ప ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ చూశాక ప్రాథమికంగా ఒక అంచనాకు రావొచ్చు. మూవీలో విషయం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి మరో రెండు రోజుల్లో కన్నప్ప మూవీపై ప్రేక్షకులకు ఓ స్పష్టత వస్తుందనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది.
13th June!#kannappa #harharmahadevॐ pic.twitter.com/BHcUzqIZZu
— Vishnu Manchu (@iVishnuManchu) June 10, 2025