7-seater car that cost: కారు కొనాలని అనుకునేవారు వివిధ అవసరాల నిమిత్తం ఎంచుకుంటారు. కొందరు కార్యాలయ అవసరాలకు కారు కొనుగోలు చేస్తే… మరికొందరు ఫ్యామిలీలో కలిసి ప్రయాణాలు చేయడానికి 4 వెహికల్ ను సొంతం చేసుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు, మూడు ఫ్యామిలీలు కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప్యంలో మిగతా వాహనాల కంటే సొంతంగా వెహికల్ ఉండడం వల్ల అవసరం ఉన్నప్పుడల్లా రెండు, మూడు ఫ్యామిలీలు కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. ఈ తరుణంలో 7 సీటర్ కారు ఉండాలని అనుకుంటున్నారు. 7 సీటర్ కారు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. విశాలమైన స్పేస్ తో పాటు విహార యాత్రలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇటీవల ఓ కంపెనీకి చెందిన 7 సీటర్ కారు అమ్మకాల్లో దూసుకుపోతుంది. అయితే దీని ధర తక్కువ కావడం విశేషం. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసా?
7 సీటర్ కారు అనగానే Toyta Innova పేరు ఎక్కువగా చెబుతారు. కానీ ప్రస్తుత సమయంలో Maruthi Ertiga పేరు బాగా వినిపిస్తోంది. ఈ కారు అమ్మకాల్లో టాప్ పోజిషన్ లోకి వెళ్లింది. అయితే ఇటీవల మరో కంపెనీ Renault కంపెనీకి చెందిన 7 సీటర్ కారు అమ్మకాలు పెరిగాయి. అదే Triber.ఈ ఏడాది అక్టోబర్ లో Renault Triber 3,870 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. గత నెలతో పోలిస్తే 0.23 శాతం సేల్స్ పెరిగాయి. అయితే వృద్ధి శాతం తక్కువే అయినా డౌన్ కాకపోవడంతో ఈ కారును ఆదరిస్తున్నారని అర్థం అవుతోంది. అంతేకాకుండా 7 సీటర్ కారు సేల్స్ లో మారుతి ఎర్టిగా తరువాత రెనాల్ట్ ట్రైబర్ ఉండడం విశేషం.
Renault Triber లో ఆకట్టుకునే ఫీచర్లు, ఇంజిన్ వ్యవస్థ ఉండడమే దీని సేల్స్ పెరగడానికి కారణం. ఇందులో 1.0 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 71 బీహెచ్ పీ పవర్ తో పాటు 96 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఇది 7 సీటర్ కారు అయినప్పటికీ లగ్జరీ కార్ల వలె పనిచేస్తుంది. ఇక ఎంపీవీ అమ్మకాల్లో ఇతర కార్లతో పోలిస్తే దీని సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్, ఎస్ యూవీలను కాదని రెనాల్ట్ ట్రైబర్ ను కోరుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది.
రెనాల్ట్ ట్రైబర్ లో ఉండే ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 8 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఏసీ వెంట్స్, ఫుష్ బటన్ స్టార్ట్, సెంట్ కన్ఫఓల్ లో గోల్డ్ స్టోరేజ్ వంటివి ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో పాటు సేప్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ప్రయాణికుల రక్షణకు 4 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటేడ్ రియర్ పార్కింగ్ సెన్సార్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వంటిని ఆకర్షిస్తున్నాయి.
Renault Triber లో ఇన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ దీని ధర విషయం అందరినీ ఆకట్టుకుటోంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో రూ.6 లక్షల ప్రారంభ ధరతదో ఉంది. టాప్ ఎండ్ మోడల్ రూ.8.69 లక్షలతో విక్రయిస్తున్నారు. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఒకేసారి ప్రయాణించడానికి ఇది అనుగుణంగా ఉండడంతో చాలామంది దీనిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.