Don’t Wake These Five People: అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రాల ద్వారా రాజ్యాలను నడిపించాడు. రాజనీతి శాస్త్రాలను మాత్రమే కాకుండా మనుషుల జీవితానికి సంబంధించిన విలువైన సూత్రాలను అందించాడు. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే కొన్ని సమస్యల పరిష్కారానికి కొన్ని టిప్స్ ను అందించాడు. వాటిని ఫాలో అవుతూ చాలా మంది తమ జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఇందులో భాగంగా చాణక్య చెప్పిన నీతి సూత్రం ప్రకారం కొందరిని నిద్ర లేపవడం వల్ల ఎదుటివారికి తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపాడు. మనుషులతో పాటు జంతువులకు కూడా నిద్ర చాలా అవసరం. నిద్ర పోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటారు. ఈ ప్రశాంతతను చెడగొట్టడం ద్వారా వారికి తీవ్రమైన కోపం వస్తుంది. ముఖ్యంగా ఈ 5 రకాల వారిని నిద్రలేపడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుంది. మరి ఆ 5గురు ఎవరో తెలుసా?
యజమాని:
ఒక సంస్థ లేదా కంపెనీలో పనిచేసినప్పుడు యజమానికి అనుగుణంగా నడుచుకోవాలి. లేకుంటే జీతభత్యాలు అందవు. అయితే పలు అవసరాల నిమిత్తం ఉద్యోగులు యజమానిని నిద్ర లేపాల్సి వస్తుంది. సంస్థలో ఉన్నప్పుడే కాకుండా వారు ఇంట్లో ఉన్న సమయంలో ఫోన్ ద్వారా నిద్ర లేపినా ఇలాంటి వారికి కోపం వస్తుంది. ఎందుకంటే యజమాని బాధ్యత కలిగిన వ్యక్తి. ఇతనికి ఎన్నో రకాల ఒత్తిడిలు ఉంటాయి. ఈ ఒత్తిడిని నిద్రతో మాత్రమే జయించగలుగుతాడు. దీంతో యజమాని నిద్ర పోతున్న సమసయంలో ఆయనను డిస్ట్రబ్ చేస్తే చాల కోపం వస్తుంది.
చిన్నపిల్లలు:
చిన్న పిల్లలకు నిద్ర చాలా అవసరం. ఈ వయసులో వారు ఆహారం తక్కువ తీసుకున్నా కనీసం 8 గంటల పాటు నిద్రపోవాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉంటారు. అయితే నిద్రిస్తున్న చిన్న పిల్లలను లేపడం వల్ల వారు తీవ్ర ఆవేదనకు గురవుతారు. ఒక్కోసారి ఆగకుండా ఏడ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వారిని మధ్యలో నిద్ర లేపవడం వల్ల వారిలో అనేక అవయావాల పనితీరులో తేడాలు ఉంటాయి.
మూర్ఖులు:
కొందరు మూర్ఖులు ఎంత చెప్పినా వినరు. తాము చెప్పిందే వేదం అంటారు. ఇలాంటి వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అందులోనూ వారు నిద్ర పోతున్నప్పుడు అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారిగా నిద్రలేచిన వాళ్లు ఎదుటివాళ్లపై అరుస్తారు. వారు ఎందుకోసం నిద్రలేపారో అర్థం చేసుకోలేరు.
పాములు:
పాములను చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఇవి ఎక్కువగా అడవిలోనే ఉంటాయి. అయితే అప్పుడప్పుుడు జనసంచారంలోకి వచ్చిన సమయంలో కొందరు వారిపై దాడికి దిగుతారు. అయితే ఎక్కడైనా పాము నిద్రపోతుంటే వాటిని లేపకూడదు. ఎందుకంటే ఇవి తమ నిద్ర పాడు చేశారన్న కోపంతో ఎదురుదాడికి దిగుతుంటారు.
కుక్కలు:
అత్యంత విశ్వాసం కల జంతువుల్లో కుక్కల పేరు చెబతాం. వీటిపై ఎంత ప్రేమ చూపితే అవి తిరిగి అంతే ప్రేమను అందిస్తాయి. అయితే వాటిని అకారణంగా కొట్టడం చేస్తే తిరగబడుతాయి. ఇక నిద్రపోతున్న సమయంలో కుక్కను లేపడం వల్ల వాటిక తీవ్రమైన కోపం వస్తుంది. దీంతో ఎదురుదాడికి దిగే ప్రమాదం ఉంది.