Homeఅంతర్జాతీయంPakistan Army Rocket Force: పాకిస్తాన్‌ యాంటీ రాకెట్‌ ఫోర్స్‌.. కొత్త వ్యూహం వెనుక రహస్యం...

Pakistan Army Rocket Force: పాకిస్తాన్‌ యాంటీ రాకెట్‌ ఫోర్స్‌.. కొత్త వ్యూహం వెనుక రహస్యం ఏంటి?

Pakistan Army Rocket Force: భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పాకిస్తాన్‌ రక్షణ వ్యవస్థలను ఛేదించిన తర్వాత, ఇస్లామాబాద్‌ తన అణ్వాయుధాలు, రఫాల్‌ కూల్చామనే ప్రచారాలతో బుకాయించడానికి ప్రయత్నించింది. అయితే ప్రపంచ దేశాలు ఈ మాటలను ఆమోదించకపోవడంతో, పాకిస్తాన్‌ అమెరికా, చైనా సహాయం కోరుతూ గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఈ ఆపరేషన్‌ భారత సైనిక సామర్థ్యాన్ని నిరూపించడమే కాక, పాకిస్తాన్‌ కొత్త రక్షణ చర్యలకు దారి తీసింది.

ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం
మే 10న భారత్‌ ఈ ఆపరేషన్‌ను హోల్డ్‌లో పెట్టింది. దీనిలో పాకిస్తాన్‌ కిరాణా హిల్స్, సర్‌గోధా, నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌లతో సహా స్ట్రాటజిక్‌ కమాండ్‌లు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్‌ తన అణ్వాయుధాలకు నష్టం లేదని చెప్పినా, భారత మిసైళ్లు, రాకెట్లు తట్టుకోలేకపోవడం స్పష్టమైంది.

కొత్త రక్షణ వ్యూహం
ఆగస్టు 13, 2025న పాకిస్తాన్‌ యాంటీ–రాకెట్‌ ఫోర్స్‌ కమాండ్‌ను ఏర్పాటు చేసింది. ఇది చైనా సాంకేతిక సహకారంతో రూపొందింది. ముందు అణ్వాయుధాలతో బెదిరించిన పాకిస్తాన్, ఇప్పుడు రాకెట్‌ రక్షణపై దృష్టి పెట్టడం భారత దాడి పాఠాల సూచిక. ఇది భారతం యొక్క లాంగ్‌–రేంజ్‌ మిసైళ్లను 240 నుంచి 250 కి.మీ రేంజ్‌ మిసైళ్లను ఎదుర్కోవడానికి రూపొందించబడింది.

యుద్ధంలో కేపబులిటీ(సామర్థ్యం) మరియు స్కేలబులిటీ (విస్తరణ) కీలకం. పాకిస్తాన్‌ వద్ద నఫెర్‌ మిసైళ్లు 80 కి.మీ. పరిధి మాత్రమే ఉంది. భారత లాంగ్‌–రేంజ్‌ క్షిపణులతో పోల్చితే తక్కువే. ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత పాకిస్తాన్‌ అణ్వాయుధాలు ఉన్న ప్రదేశాలపై కూడా దాడి చేయగలదని నిరూపించింది. పాకిస్తాన్‌ కొత్త ఫోర్స్‌ ఈ అసమతుల్యతను సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ తట్టుకోవడం మాత్రం అంత ఈజీ కాదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular