Pakistani Journalist questions Pak Govt: ఇదే వ్యవహారంపై ఉగ్రవాద దేశం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.. అసలు భారత్ మీద మీరు దాడి చేస్తే.. ఆ దేశంలో గనుక నష్టం వాటిల్లితే దానికి సంబంధించిన ఫోటోలు ఏవి? వాటికి ఆధారాలు ఏవి? అసలు మీరు నిజాలు చెబుతున్నారా? వాటిని నిజాలు అని ఎలా అనుకోవాలి? ఇలా వారి సొంత దేశం నుంచే అప్పట్లో విమర్శలు ఎదురయ్యాయి. దానిపై పాకిస్తాన్ అధికారులు నోరు మెదపలేదు. పైగా మన దేశంపై ప్రయోగించిన క్షిపణులు కూలిపోవడం.. కొన్ని సందర్భాలలో ఎస్ 400 వంటి అధునాతన వ్యవస్థలు అడ్డుకోవడంతో ఉగ్రవాద దేశం సైలెంట్ అవ్వాల్సి వచ్చింది.. అంతేకాదు పాకిస్తాన్ క్షిపణులు మధ్యలోనే కూలిపోయిన తీరు పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదురయ్యాయి..మీమ్స్ కు ఐతే ఇక లెక్కే లేదు. పాకిస్తాన్ కు సరిహద్దుల్లో ఉన్న మన రాష్ట్రాలలో కూలిపోయిన క్షిపణులతో. అక్కడి యువత ఆటలాడుకుంది.. పేలిపోకుండా అలా ఉన్న క్షిపణులను.. పేల్చి చూపింది. అప్పట్లో ఈ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి.
ప్రస్తుత యుద్ధం వేళ..
ప్రస్తుతం ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ దేశానికి చెందిన ఓ పాత్రికేయుడు తమ దేశ ఆర్మీని, ప్రభుత్వాన్ని నిలదీస్తూ సుదీర్ఘంగా ఒక పోస్ట్ చేశాడు..” అత్యంత సమర్థవంతంగా ఉన్న ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ ను ఇరాన్ ప్రయోగించిన మిస్సైల్స్ కొన్ని సందర్భాలలో చేదిస్తున్నాయి. గొప్ప గొప్ప దేశాలకు సాధ్యం కానీ ఘనతను అవి సాధిస్తున్నాయి. ఒకరకంగా ఇజ్రాయిల్ కు చుక్కలు చూపిస్తున్నాయి. మరి మనం భారత్ మీద యుద్ధం చేసినప్పుడు.. మనం ప్రయోగించిన ఒక్క మిస్సైల్ కూడా ఆ దేశంలో ఎందుకు పడలేదు. ఏ ఒక్క ప్రాంతంలోనూ విస్పోటనం ఎందుకు చోటు చేసుకోలేదు. పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణుల మొత్తాన్ని ఒక ఎస్ 400 మాత్రమే ఎలా నేల కూల్చగలిగింది. ఇండియాలో డ్యామే జరిగినట్టు ఒక ఫోటో కూడా కనిపించలేదు ఎందుకు? ఒక వీడియో కూడా దర్శనం ఇవ్వలేదు ఎందుకు? అంతర్జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించలేదు?” అంటూ ఆ దేశ జర్నలిస్ట్ పాకిస్తాన్ ఆర్మీని, దేశాధినేతలను విమర్శించాడు.
Also Read: Lagadapati Rajagopal Latest Photo: ఎలా ఉండే లగడపాటి రాజగోపాల్ సర్.. ఇలా అయిపోయారేంటి?
సోషల్ మీడియాలో సంచలనం
పాకిస్తాన్ జర్నలిస్టు ఈ తీరుగా ప్రశ్నలు అడగడంతో కలకలం నెలకొంది. వాస్తవానికి ఈ ప్రశ్నలకు ఆ దేశ ఆర్మీ గానీ.. ఆ దేశ పరిపాలకులు గాని సమాధానం చెప్పలేకపోయారు. పాకిస్తాన్ జర్నలిస్ట్ అడిగిన ఈ ప్రశ్నల పరంపర సామాజిక మాధ్యమాలలో మంటలు పుట్టిస్తోంది. ” అసలు చైనా నుంచి కొన్ని సరుకు ఎలా పనిచేస్తుంది.. తుర్కియో ఇచ్చిన సామగ్రి ఎలా ఉపయోగపడుతుంది.. ఏదో కొన్నామంటే కొన్నారు. ఆ దేశాలు కూడా ఇచ్చామంటే ఇచ్చాయి. మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? దీపావళికి పేల్చుకునే బాంబులను యుద్ధానికి వాడితే ఎలా ఉంటుందంటూ” నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు ఉగ్రవాద దేశాన్ని తూర్పార పడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధిగా ఉంటే మంచిదని.. లేకుంటే భారత్ నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నారు.