Sitara Silver Screen Entry
Mahesh Babu Daughter: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార ఘట్టమనేని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే హీరోయిన్స్ రేంజ్ క్రేజ్ సంపాదించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది సితార. తనకు సంబంధించిన డాన్స్ వీడియోలు, రీల్స్, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. సితార పోస్ట్ చేసే వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. ఈ స్టార్ కిడ్ సితార ఫ్యూచర్ లో ఏమి చేయాలో చాలా క్లారిటీతో ఉంది.
తన తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తానని, హీరోయిన్ అవుతాను అని సితార చాలాసార్లు చెప్పుకొచ్చింది. 12 ఏళ్ల సితార చక్కని రూపంతో చాలా క్యూట్ గా ఉంటుంది. హీరోయిన్ కి కావాల్సిన అన్ని లక్షణాలు ఆమెలో ఉన్నాయి. ఒక పక్క చదువుకుటుంటూనే మరోవైపు డాన్స్ లో ప్రావీణ్యత సాధిస్తుంది. ఆల్రెడీ ఓ అంతర్జాతీయ జ్యూవెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ఈ యాడ్ లో నటించినందుకు గాను సితార కోటి రూపాయలు తీసుకుందనే ప్రచారం జరిగింది.
Also Read: Fahadh Faasil: పుష్ప నటుడు ఒక్క రోజుకు అంత తీసుకుంటాడా..? కండిషన్స్ కూడా భారీగానే ఉన్నాయిగా…
తండ్రి మహేష్ మాదిరి దానధర్మాలు చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటుంది. తన మొదటి సంపాదన సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించింది. ఇలా తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకుంది. సితార నటిగాగా రాణించాలి అనుకుంటున్నట్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో దీనిపై మరింత స్పష్టత ఇచ్చింది. అదే సమయంలో తెలుగు ప్రేక్షకులకు చిన్న ఝలక్ కూడా ఇచ్చింది.
Also Read: Kalki Movie Story: కల్కిలో ప్రభాసే విలన్… పార్ట్ 1 కథ ఇదే!
సితార పాప ఏకంగా తన డెబ్యూ మూవీ హాలీవుడ్ లో చేయాలని ప్లాన్ చేస్తుందట. సితార మాట్లాడుతూ .. చిన్నప్పటి నుంచి నాన్నని చూస్తూ పెరగడం వల్ల నాకు కూడా సినిమాలంటే ఆసక్తి కలిగింది. నాకు సినిమాల్లోకి రావాలని ఉంది. అయితే ఇంగ్లీష్ సినిమాల్లోనే నటించాలి అనుకుంటున్నాను అని చెప్పింది. అంటే సితారకు టాలీవుడ్, బాలీవుడ్ లో నటించాలని పెద్దగా ఆసక్తి లేదు. సితార ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతుంది. తనకు హాలీవుడ్ చిత్రాలే కరెక్ట్ అని ఆమె భావిస్తున్నారు. కేవలం 7వ తరగతి చదువుతున్న సితార నటి కావడానికి ఇంకా సమయం ఉంది.