Baloch Liberation Army Attacks: పాకిస్తాన్ నుంచి విడిపోవాలని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ తాజాగా తన పోరాటం మళ్లీ ఉధృతం చేసింది. కొన్ని రోజులుగా సైలెంట్‌గా కనిపించింది. కానీ తాజాగా తీవ్రమైన దాడులతో పాకిస్తాన్ సైన్యానికి, పాలకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) గడిచిన రెండు రోజుల్లో 14 నగరాల్లో 48 చోట్ల టార్గెట్‌లపై తిరుగుబాటు చేసింది. కాన్వాయ్‌లు, సైనిక కేంద్రాలు, రోడ్లు, 23 చెక్‌పాయింట్లు, ప్రభుత్వ కార్యాలయాలు లక్ష్యాలుగా మారాయి. గ్వాదర్, పస్ని, దళబదీర్, క్వెట్టా శివార్ల సహా అనేక ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ జరిగింది.
టాక్టికల్ వ్యూహాలు..
బీఎల్‌ఏ గతంలో ఎన్నడూ చేయని విధంగా ఈసారి టాక్టికల్ వ్యూహాలతో దాడులు చేస్తోంది. ఐఈడీలు రోడ్లు, వాహనాల్లో అమర్చి పేస్తున్నారు. ఇక ఈసారి మహిళా ఆత్మాహుది దళాలు కూడా రంగంలోకి దిగాయి. గతంలో కరాచీ యూనివర్సిటీ వద్ద ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఇద్దరు చైనా పౌరులు మరణించారు. తాజాగా ఆసిఫా మెంగల్ అనే యువతి ఇటీవల సైనిక స్థావరాలపై తనను తాను పేల్చుకుంది. దీంతో పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం జరిగింది.
ఆపరేషన్ హెరాఫ్‌గా..
బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడుల ఆపరేషన్‌ను హెరాఫ్‌గా పిలుస్తోంది. హెరాఫ్ అంటూ బలూచ్ భాషలో చీకటి తుపాను అని అర్థం. అయితే ఇది 2023లోనే మొదలు పెట్టింది. తాజాగా 2025 డిసెంబర్‌లో హెరాఫ్ సెకండ్ ఫేజ్ ప్రారంభించింది. ఉధృతమైన దాడులతో పాకిస్తాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సైనికులు కూడా బలూచ్ దాడులను ఎదుర్కొనలేకపోతున్నారు. దీంతో బలూచ్‌ను వీడిపోతున్నారు. క్యాంపులు ఖాళీ చేస్తున్నారు.
భారీగా నష్టం..
బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల్లో పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం జరిగింది. 200 మంది సైనికులు మరణించారు. 20 మంది అధికారులను కిడ్నాప్ చేశారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం 17 మంది మరణించినట్లు ప్రకటించి వాస్తవాన్ని దాచిపెడుతోంది. ఇక 150 మంది ఉగ్రవాదులను చంపామని గొప్పలు చెబుతోంది.
హెరాఫ్ 2023లో మొదలై, 2025 చివర్లో రెండో దశ ప్రారంభమైంది. బలూచిస్తాన్ (పాక్ భూభాగం 42%) రేర్ ఎర్త్ మినరల్స్, బంగారు గనులు కలిగి ఉంది. పాక్, చైనా (సీపీఈసీ ద్వారా) వీటిని దోచుకుంటున్నాయి. పాక్ అభివృద్ధి పట్టించుకోకపోవడం, విదేశీలపై దాడులు ఉద్యమాన్ని బలపరుస్తున్నాయి. అమెరికాకు కూడా రేర్ ఎర్త్ అమ్మకాలు జరుగుతున్నాయి.