Homeఅంతర్జాతీయంPakistan US Iran Peace Talks: పాకిస్థాన్ కు గుర్తింపు కావాలంట..ఓసారి ఆ బ్రహ్మోస్ కు...

Pakistan US Iran Peace Talks: పాకిస్థాన్ కు గుర్తింపు కావాలంట..ఓసారి ఆ బ్రహ్మోస్ కు పని చెప్పండి మోడీ సార్

Pakistan US Iran Peace Talks: ఒక కుటుంబంలో పిల్లాడికి అందరి ప్రశంస కంటే తండ్రి ప్రశంస ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ తండ్రి అంత ఈజీగా ప్రశంసించడు.. ఏదైనా గొప్ప పని చేస్తేనే శభాష్ అంటూ భుజం తట్టి అభినందిస్తాడు.. ఈ సృష్టిలో అందరికంటే తండ్రి ప్రశంసకు విలువ ఉంటుంది. కానీ, తండ్రి ప్రశంస అంత సులభంగా పిల్లలకు లభించదు.

ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. ఆమధ్య అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించినట్టు పాకిస్తాన్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంది. చివరికి తన తాహతుకు మించిన వ్యవహారమైనప్పటికీ.. ఇస్లామాబాదులో ఖరీదైన హోటల్లో చర్చల ప్రక్రియ మొదలుపెట్టింది. ఆ ప్రక్రియ అర్ధాంతరంగా అయిపోయింది. హోటల్ బిల్లు తడిసి పోయింది. ఇంతవరకు ఆ బిల్లును పాకిస్తాన్ చెల్లించలేదు. అనేక దఫాలుగా శాంతి చర్చలు అంటూ పాకిస్తాన్ ఊదరగొట్టినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అటువంటి సన్నివేశం కనిపించలేదు.

ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ముగించుకున్నాయి. తాత్కాలిక ఒప్పందానికి వచ్చేసాయి. ఇదంతా జరిగిన తర్వాత.. ట్రంప్ తన ఒక్క మాటలో కూడా పాకిస్తాన్ గురించి ప్రస్తావించలేదు. ఇరాన్ కూడా మాట్లాడలేదు. చివరికి గల్ఫ్ దేశాలు కూడా ఏమాత్రం పాకిస్తాన్ గురించి ఒక్క మాట కూడా వివరించలేదు. దీంతో పాకిస్తాన్ పరువు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో పోయింది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ దేశానిది.

ఇవన్నీ ఎలా ఉన్నా సరే.. గతంలో తాము శాంతి చర్చల ప్రక్రియలో కీలకపాత్ర పోషించాం కాబట్టి.. యుద్ధం ముగింపులో పాల్గొన్నం కాబట్టి.. తమ స్థాయిని భారత్ గుర్తించి ఉంటే బాగుండేదని పాకిస్తాన్ పదే పదే కలవర పడింది.. వాస్తవానికి అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన సందిలో పాకిస్తాన్ కేవలం కొరియర్ పాత్ర మాత్రమే పోషించింది. ఈ యుద్ధానికి ముగింపులో ఖతార్ కీలక భూమిక పోషించింది. . అయితే భారత తమను గుర్తించకపోవడం పట్ల పాకిస్థాన్ మంత్రి కావాజా అసిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్ మెచ్చుకొని ఉంటే బాగుండేదని.. ఈ దిశగా తాము ఆలోచిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ దేశానికి సొంత గుర్తింపు ఉండదు. భౌగోళికంగా గొప్ప పేరు ఉండదు. అందువల్లే ప్రతి సందర్భంలో భారతదేశంతో పోల్చుకుంటుంది. చివరికి ఎటూ కాకుండా పోతుంది.. పాకిస్తాన్ గుర్తింపు కోసం ఏ స్థాయిలో తహతహలాడుతుందో.. అదే సమయంలో తన ఉనికిని ఏ స్థాయిలో కోల్పోతుందో.. ఈ ఉదంతం నిరూపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper
Exit mobile version