Varanasi Movie Shooting: రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ నుండి చిన్న అప్డేట్ బయటకు వచ్చినా చాలు , నేషనల్ లెవెల్ లో ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది. ఈ చిత్రం కోసం కేవలం రాజమౌళి , మహేష్ బాబు అభిమానులు మరియు టాలీవుడ్ మూవీ లవర్స్ మాత్రమే కాదు, అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన మూవీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే #RRR తర్వాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కాబట్టి. అందులోనూ ఈ చిత్రం లో ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ , సైన్స్ ఫిక్షన్ , ట్రిమ్ ట్రావెల్ వంటి జానర్స్ తో పాటు , రామాయణం ఇతిహాసానికి కూడా లింక్ ఉండడం వల్ల , ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో వండర్స్ ని నెలకొల్పుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ విరామం లేకుండా సాగుతూనే ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫోటో ని కాసేపటి క్రితమే సోషల్ మీడియా లో విడుదల చేశారు. సన్నివేశం నెంబర్ 76, బుల్ -410A షాట్ , టెక్ 1 , డే షూట్ అనే క్లాప్ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో కోటి లింగాలు సెట్ కనిపించడం గమనార్హం. అంటే ప్రస్తుతానికి సినిమాలో హైలైట్ గా నిలవబోయే బుల్ షాట్స్ ని తెరకెక్కిస్తున్నారు అన్నమాట. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నెల లోపు పూర్తి చెయ్యాలని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. మరి సమయానికి ఈ సినిమా పూర్తి అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ అనుకున్న సమయానికి ఈ చిత్రాన్ని పూర్తి చేస్తే , రాజమౌళి కెరీర్ లోనే అత్యంత వేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రంగా ఈ సినిమా సరికొత్త రికార్డు ని నెలకొల్పబోతుంది అనుకోవచ్చు.
ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ లేదా టీజర్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు 9 న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘వారణాసి’ నుండి గ్లింప్స్ వీడియో విడుదల చెయ్యాలని అభిమానులు రాజమౌళి ని ట్యాగ్ చేసి చాలా బలంగా కోరుతున్నారు. మరి అభిమానుల కోరికను రాజమౌళి నెరవేరుస్తాడో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా , విలన్ గా పృథ్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఆయన షూటింగ్ పార్ట్ కూడా పూర్తి అయ్యిందట.
