Pakistan India Dispute: బుర్ర ఉండగానే సరిపోదు.. అందులో గుజ్జు కూడా ఉండాలి. ఆ గుజ్జు చైతన్యవంతంగా పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మన ఆలోచనలు బాగుంటాయి. పాపం పాకిస్తాన్ దేశానికి ఇది లేనట్టుంది. అందువల్లే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. పిచ్చి లేసినట్టుగా వ్యవహరిస్తోంది. చివరికి భారత్ ట్రాప్ లో చిక్కుకొని విలపిస్తోంది.
కాశ్మీర్లో పహల్గాం దాడి జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ దేశానికి భారత్ సింధు జలాలను నిలిపివేసింది. దశాబ్దాల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసి పడేసింది. అప్పట్నుంచి తాగునీరు దొరకడం లేదు. సాగునీరు అందడం లేదు. ఫలితంగా పాకిస్తాన్ దేశం అల్లాడిపోతోంది. ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడం పట్ల ఏకంగా శాశ్వత మధ్యవర్తిత్వ కోర్టు దగ్గరికి వెళ్ళింది.. అయితే భారత్ ఈ కోర్టును పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. దాని విచారణను కూడా లైట్ తీసుకుంది. ఇక పాకిస్తాన్ అప్పటినుంచి ఈ కోర్టులో కరకరకాలుగా తన వాదనలు వినిపిస్తోంది.
ఇప్పుడు పాకిస్తాన్ దేశానికి మరొక ఇబ్బంది ఎదురైంది.. ఈ కేసు విచారణలో తీర్పురావాలి అంటే భారత్ కూడా తన పాత్ర పోషించాలి. కానీ భారత్ ఈ కోర్టును పట్టించుకోవడం లేదు. విచారణను సైతం లెక్కచేయడం లేదు. భారత్ ఈ వ్యవహారంతో దూరంగా ఉంటోంది కాబట్టి.. ఖర్చులు మొత్తం పాకిస్తాన్ భరించాల్సి వస్తుంది. కోర్టు నిబంధనల ప్రకారం విచారణకు చెల్లించాల్సిన ఖర్చులు మొత్తం పాకిస్తాన్ భరిస్తోంది. భారత్ ఈ కోర్టును పట్టించుకోవడం లేదు కాబట్టి.. వాది, ప్రతివాది ఖర్చులు మొత్తం పాకిస్తాన్ చెల్లించాల్సి వస్తోంది.
భారత్ సింధుజలను నిలిపివేయడంతో పాకిస్తాన్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఒక రకంగా భారత్ వేసిన ట్రాప్ లో పాకిస్తాన్ పడిపోయింది. ఇప్పటివరకు ఈ కేసు విచారణ కోసం పాకిస్తాన్ ఏకంగా ఆరు లక్షల డాలర్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఇంకా కొనసాగితే ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది.. భారత్ కిషన్ గంగ.. రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వీటిని నిర్మాణం ద్వారా భారత్ నిబంధనలు మొత్తం ఉల్లంఘిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. అందువల్లే పాకిస్తాన్ శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఇటువంటి సాంకేతిక అంశాలను మధ్యవర్తిత్వ న్యాయస్థానం పరిష్కరించలేదని.. తటస్థంగా ఉండే నిపుణులు మాత్రమే ఈ సమస్యను పరిష్కరిస్తారని భారత్ చెబుతోంది. భారత్ ఈ కేసులో పాలుపంచుకోనంతవరకు పాకిస్తాన్ దేశానికి డబ్బులు చెల్లించక తప్పదు.
