Homeబిజినెస్Oppo K15: షాకింగ్ డిస్‌ప్లే.. పవర్‌ఫుల్ ప్రాసెసర్..ఈ కొత్త ఫోన్ గురించి తెలుసా..

Oppo K15: షాకింగ్ డిస్‌ప్లే.. పవర్‌ఫుల్ ప్రాసెసర్..ఈ కొత్త ఫోన్ గురించి తెలుసా..

Oppo K15: Oppo బ్రాండ్ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. వినియోగదారులను ఇంప్రెస్ చేసేందుకు ఈ కంపెనీ సైతం లేటేస్ట్ గా Oppo K15ని త్వరలోనే అధికారికంగా లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ‘K15 ప్రో’ మోడల్స్ మార్కెట్లో ఉండగా.. ఇప్పుడు స్టాండర్డ్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ మొబైల్ ఎలా ఉండబోతుందో చూద్దాం.. ఒప్పో K15 స్మార్ట్‌ఫోన్ జులై 24న అధికారికంగా చైనా మార్కెట్లో విడుదల […]

Oppo K15: Oppo బ్రాండ్ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. వినియోగదారులను ఇంప్రెస్ చేసేందుకు ఈ కంపెనీ సైతం లేటేస్ట్ గా Oppo K15ని త్వరలోనే అధికారికంగా లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ‘K15 ప్రో’ మోడల్స్ మార్కెట్లో ఉండగా.. ఇప్పుడు స్టాండర్డ్ మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ మొబైల్ ఎలా ఉండబోతుందో చూద్దాం..

ఒప్పో K15 స్మార్ట్‌ఫోన్ జులై 24న అధికారికంగా చైనా మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఫోన్ డిజైన్ పరంగా K15 ప్రో సిరీస్‌ను పోలి ఉంటుంది. ఫ్లాట్ ఫ్రేమ్ బాడీ, వెనుక వైపు రెక్టాంగులర్ కెమెరా మాడ్యూల్‌తో పాటు బ్యాక్ ప్యానెల్‌లో ఆకర్షణీయమైన సిగ్నేచర్ ‘బ్రీతింగ్ లైట్’ ప్రత్యేకతగా నిలవనుంది. ఇది రాయల్ వైట్, గేల్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ ఫోన్ 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది అద్భుతమైన విజువల్స్ తో స్మూత్ స్క్రోలింగ్‌ను అందిస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 సూపర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఫోన్ వేగాన్ని, ఎఫిషియన్సీని పెంచడానికి ఇందులో ఒప్పో యొక్క సొంత ‘టైడ్ ఇంజిన్’ టెక్నాలజీని కూడా జోడించారు. ఈ ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ అనే సింగిల్ వేరియంట్‌లో రానుంది.

ఇందులో ఊహించని విధంగా 8,000mAh బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీ వేగంగా ఛార్జ్ చేయడం కోసం 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించారు. హెవీ గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో పాటు ఐదేళ్ల మన్నిక గల ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌ను కూడా ఇందులో అమర్చారు.

ఫోటోగ్రఫీ కోసం ఒప్పో K15 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అందులో OIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా , 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. కెమెరా పక్కనే ఆకర్షణీయమైన ఆర్‌జిబి రింగ్ లైట్ కూడా ఉంటుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా పవర్‌ఫుల్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ను అందించడం విశేషం. అంతేకాకుండా నీరు మరియు ధూళి నుండి అత్యుత్తమ రక్షణ కోసం దీనికి IP69 రేటింగ్* ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper