Pakistan: ఆపరేషన్ సిందూర్‌లో గట్టి దెబ్బ తగిలిన పాకిస్తాన్, ఉగ్రవాద దృష్టిని తాత్కాలికంగా మానేసింది. మరోవైపు పాకిస్తాన్‌లోని 9 ఉగ్రవాద సంస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వంద మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. దీంతో ఉగ్ర కార్యకలాపాలు కాస్త తగ్గాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మరో కొత్త వ్యూహం రూపొందిస్తోంది. జైష్–ఎ–మహ్మద్ (జెఎం), లష్కర్–ఎ–తౌహీద్ (ఎల్‌టీ)తో పాక్ ఐఎస్‌ఐ, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)ను కలిపే ప్రయత్నం చేస్తోంది. ఆఫ్ఘాన్ సరిహద్దు ఆధారంగా పనిచేసే ఐఎసకేపీ భారత వ్యతిరేక టార్గెట్లు, వ్యూహాలు అందిస్తోంది. ఈ మూడు సమూహాల సమ్మేళనం కశ్మీర్‌పై దాడులను ఊపందుకుంటుందని ఇంటెలిజెన్స్ సూచనలు.
హమాస్ కోఆర్డినేషన్, కీలక భేటీలు
పూంచ్‌లోని లాంచ్ ప్యాడ్‌లు, జెఎం–ఎల్‌టి కార్యాలయాలను హమాస్ నాయకులు సందర్శించారు. సయిఫ్‌ఉల్‌లా కసూరి (ఎల్‌టి), తల్హా సయ్యిద్ (జెఎం)తో పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ అధికారుల భేటీలు జరుగుతున్నాయి. ఐఎస్‌కేపీ నాయకుడు మీర్ షఫీఖ్ మంగల్, ఎల్‌టి కమాండర్ రాణా అశ్వక్‌కు ఆయుధాలు అందజేశారు. ఎల్‌గార్ మ్యాగజైన్‌లో ఈ కార్యకాలాలు ప్రకటించబడ్డాయి. హమాస్ మార్గదర్శకత్వంతో భారత్‌పై ఫోకస్ పెంచాలని పాక్ లక్ష్యం.
ఆర్థిక మద్దతు, నిధుల సమీకరణ..
టర్కీ, ఖతార్ ద్వారా ఐఎస్‌కేపీ, ఎల్‌టికి నిధులు పంపుతోంది ఐఎస్‌ఐ. ఎల్‌టి చొరబాటు నైపుణ్యాలు, జెఎం ఆత్మాహుతి దాడులు, ఐఎస్‌కేపీ పట్టణ ఎటాక్‌లు కలిపి మందు, వాహన లక్ష్యాలపై ప్లాన్. జెఎం గెరిల్లా ఫోర్స్‌లో మహిళలు కూడా చేరారు. ఐఎస్‌ఐ తెరవెనుక పని చేస్తూ రిస్క్ తగ్గిస్తోంది.
భారత ఇంటెలిజెన్స్ ఈ కూటమి వివరాలు సేకరించింది. సరిహద్దుల్లో భద్రత పెంచి, నవంబర్‌లో 50 మంది చొరబాటుదారులను పట్టుకున్నారు. ఈ మూడు సమూహాల సమ్మేళనం ప్రమాదకరమైనదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. పాక్ వ్యూహం భారతానికి కొత్త సవాలుగా మారనుంది.