Pakistan Beggars: పాకిస్తాన.. ఈ పేరు వింటే ప్రపంచమంతా గుర్తొచ్చేది ఉగ్రవాదమ. ఒసామా బిన్ లాడెన్.. మసూద్ అజర్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చింది పాకిస్తానే. తన ప్రయోజనాల కోసం భారత్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదం అనే పామును పెంచి పోషిస్తోంది. అయితే ఈ ఉగ్రవాదులు ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించారు. చివరకు పాకిస్తాన్‌పైనే దాడులకు తెగబడుతున్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాదులను ఎగుమతి చేస్తున్న పాకిస్తాన్.. ఇటీవల కొత్త దందా మొదలు పెట్టింది. ముస్లిం దేశాలకు బిచ్చగాళ్లను పంపుతోంది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు పట్టుకున్న యాచకుల్లో.. ఎక్కువ మంది పాకిస్తానీలే. జైళ్లలో ఉన్న విదేశీ భిక్షగాళ్లలో 90% దాదాపు పాకిస్తాన్‌కు చెందిన వారే.
విజిట్ వీసాలతో వెళ్లి..
హజ్, ఉమ్రా యాత్రల పేరుతో పాకిస్తాన్ పౌరులు సౌదీకి చేరుకుంటున్నారు. కొందరు టూరిస్టు వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అయితే ఇలా వెళ్లినవారు ఆయా దేశాల్లో బిచ్ఛమెత్తుకుంటున్నారు. సౌదీతో హజ్, ఉమ్రా యాత్రకు వచ్చే వారివద్ద భిక్షాటన చేస్తున్నారు. డబ్బులు ఇవ్వనివారిని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో సందర్శకులకు యాచకులు ఇబ్బందిగా మారాఉ. ఇక గల్ఫ్ దేశాల్లోనూ పాకిస్తాన్ బిచ్ఛగాళ్లు సామూహికంగా యాచిస్తూ.. డబ్బులు ఇవ్వనివారిపై దాడి చేస్తున్నారు. కొందరు దొంగలుగా మారుతున్నారు. ఇది సాధారణ అలవాటు కాకుండా, ఆధునిక మాఫియా లాంటి వ్యవస్థగా మారింది.
ఏజెంట్ల సహకారంతోనే..
పాకిస్తానీలు విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టు ఏజెంట్లు సహకారం అందిస్తున్నారు. పేదలను ఎంపిక చేసి వీసాలు, టికెట్లు సిద్ధం చేస్తున్నారు. ఇలా వెళ్లిన వారిలో విదేశీ ఆదాయంలో పెద్ద భాగం వీరికే చేరుతుంది. విచారణలు దీన్ని ఒక్కొక్కటి నేర సంస్థగా ధృవీకరిస్తున్నాయి. సౌదీ ప్రభుత్వం ఈ పరిస్థితిని తీవ్రంగా చూసి, వీసా నియమాలు కఠినపరుస్తామని హెచ్చరించింది. పాకిస్థాన్‌లో ఆర్థిక కష్టాలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రజల్ని ఇటువంటి మార్గాలకు దోహదపడుతున్నాయి.
బహిష్కరణ..
తలనొప్పిగా మారిన పాకిస్తాన్ బిచ్ఛగాళ్లను ముస్లిం దేశాలు స్వదేశానికి పంపిస్తున్నాయి. సౌదీ అరేబియా ఈ ఏడాది 24 వేల మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపింది. యూఏఈ 6 వేల మందిని, అజర్బైజాన్ 2,500 మందిని పాకిస్తాన్‌కు తిప్పి పంపింది. ఇరాన్, ఇరాక్, ఖతార్, ఒమాన్, మలేషియా, ఐరోపా దేశాల నుంచి మరో 52 వేల మంది పాకిస్తాన్‌కు తిరిగి వచ్చారు. ఈ లెక్కన పాకిస్తాన్ యాచకులను ఎలా ఎగుమతి చేస్తుందో అర్థమవుతుంది.
ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ పరువు బజారున పడడంతో ఇప్పుడు ఆ దేశ పాలకులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ముస్లిం దేశాలకు వెళ్తున్నవారిని ఎయిర్ పోర్టులో తనిఖీ చేస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు. ఎప్పుడు వస్తారు అనే వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ ఏడాది 66 వేల మందిని విదేశాలకు వెళ్లకుండా నిలువరించింది. వేలాది పాస్‌పోర్టులు రద్దు చేసింది. పార్లమెంటు కమిటీ ప్రకారం, విదేశీ భిక్షాటన ద్వారా సంవత్సరానికి 4,200 కోట్ల పాక్ రూపాయలు వస్తున్నాయి.