Homeజాతీయ వార్తలుDhurandhar: పాకిస్తాన్‌ గుండెల్లో దురంధర్‌ దడ.. ఖాన్‌ త్రయంలో టెన్షన్‌!

Dhurandhar: పాకిస్తాన్‌ గుండెల్లో దురంధర్‌ దడ.. ఖాన్‌ త్రయంలో టెన్షన్‌!

Dhurandhar: దురంధర్‌.. భారత్‌ సృష్టించిన దురంధర్‌లు పాకిస్తాన్‌లో అలజడి సృష్టిస్తున్నారు. అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. ఆందోళనలు రేకెత్తిస్తున్నారు. భయం పుట్టిస్తున్నారు. ఇది పాకిస్తాన్‌లో జరుగుతోంది. భారత్‌లో కూడా దురంధరుడి యాక్షన్స్‌ నడుస్తున్నాయి. దురంధర్‌ ఇటీవల వచ్చిన సినిమా. భారత దేశం విదేశీ గడ్డపై ఏరకంగా ఆపరేషన్లు నిర్వహిస్తుందో తెలుపుతూ వాస్తవానికి ఊహను జోడించి తీసిన సిరిమా. ఇప్పటి వరకు రూ900 కట్ల కొల్లగొట్టింది. ఈ సినిమాను ఆరు ముస్లిం దేశాలు నిషేధించాయి. నిషేధం ఉన్నా రూ.900 కోట్ల ఆదాయం సంపాదించింది. పాకిస్తాన్‌లో నిషేధం ఉన్నా.. 20 లక్షల మంది చట్టవిరుద్ధంగా డౌన్‌లోడ్‌ చేసి చూశారు. ఈ సినిమా దేశీయ హీరోయిజంను ప్రదర్శించడంతో పొరుగు దేశంలో ఆందోళనలు, భుజాలు తడుముకునే స్థితి నెలకొంది.

పాకిస్తాన్‌లో నిషేధంతో ఆసక్తి పెరిగింది..
నిషేధం ఉన్నా సినిమా ప్రజల మనసులో చేరి, పాకిస్తానీల్లో దేశ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తింది. చట్టవిరుద్ధ మార్గాల ద్వారా చూసినవారు సంఖ్య పెరగడంతో, భారత ఆపరేషన్ల శక్తిని గుర్తించారు. ఈ ఫెనామెనా సినిమా ప్రభావాన్ని రెట్టింపు చేసింది. వాస్తవ ఘటనలకు కల్పిత భాగాలు జోడించి తీర్చిన ఈ చిత్రం, పొరుగు దేశంలో మానసిక ఒత్తిడిని పెంచుతోంది.

ఖాన్‌ త్రయంలో వణుకు..
దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఆధిపత్యం చేసిన ముగ్గురు ఖాన్‌ స్టార్లు ఇప్పుడు కంగారుపడుతున్నారు. ఈద్‌ రిలీజ్‌లకు పేరుగాంచిన ఒకరు 2026 సినిమాను పోస్ట్‌పోన్‌ చేశారు. మరొకరు ఏడాది బ్రేక్‌ ప్రకటించారు. మూడో ఖాన్‌ నాలుగేళ్ల ప్రాజెక్ట్‌తో రెండేళ్లు మౌనంగా ఉంటాడు. మాఫియా ప్రభావంతో దేశ రహస్యాలను దెబ్బతీసే చిత్రాలు తీశారని విమర్శించిన ఒక నటుడు, ప్రేక్షకుల జవాబుతో తిరిగి సరిదిద్దుకుంటున్నాడు.

జాతీయవాద సినిమాల తరంగం..
కశ్మీర్‌ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఊరి వంటి చిత్రాల స్ఫూర్తితో ’దురంధర్‌’ వచ్చింది. ఆదిత్య ధావల్‌ దర్శకత్వంలో టాప్‌ హీరో హీరోయిజం చూపించిన ఈ సినిమా, రహస్య సంస్థల త్యాగాలను హైలైట్‌ చేసింది. సాధారణ దర్శకులు టాప్‌ లిస్ట్‌లో చేరడంతో, కథల ఎంపికలో మార్పు సంభవిస్తోంది. మత సంబంధిత మాఫియా ప్రభావం తగ్గే అవకాశం కనిపిస్తోంది.

దశాబ్దాల మాఫియా ఆధిపత్యానికి ఈ జాతీయవాద చిత్రాలు అడ్డుకట్ట వేస్తున్నాయి. దుబాయ్, కరాచీ నుంచి వచ్చే ఒత్తిడులు తగ్గుతూ, కథలు పేట్రియటిక్‌ టోన్‌తో మారుతున్నాయి. ఈ ధోరణి కొనసాగితే, బాలీవుడ్‌లో కొత్త యుగం ప్రారంభమవుతుంది. ప్రేక్షకుల మద్దతు ఈ మార్పును మరింత బలోపేతం చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular