Pakistan petrol diesel crisis: మన దగ్గర పెట్రోలు, డీజిల్ విరివిగా లభిస్తూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ధరలు పెరిగినప్పుడో బంకుల దగ్గర రద్దీ ఏర్పడుతుంది. ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ నిండుకుంటుంది.. ఇక ఇప్పుడు మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం వల్ల పెట్రోలు, డీజిల్ అవసరాలకు సరిపడా లభించడం లేదు. దానివల్ల పానిక్ బయింగ్ పరిస్థితి ఏర్పడుతోంది. కానీ ఇటువంటి పరిస్థితి రోజూ ఉంటే.. ఆయిల్ కంపెనీలు కాకుండా.. ఎవరో అక్రమంగా తెచ్చిన పెట్రోలు, డీజిల్ మాత్రమే దిక్కు అయితే.. వామ్మో చదువుతుంటేనే ఒకరకంగా ఉంది కదా..
పై పరిస్థితి పాకిస్తాన్ దేశంలో నిత్యకృత్యం. ఎందుకంటే పాకిస్తాన్లో ఆయిల్ కంపెనీలకు ఇతర దేశాల నుంచి భారీగా చమురు కొనుగోలు చేసే స్థాయి ఉండదు. ఒకవేళ కొనుగోలు చేసినా సరే పాకిస్తాన్ దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు చెప్పుకునే స్థాయిలో ఉండవు కాబట్టి.. దేశ అవసరాలకు సరిపడా పర్చేజ్ చేయలేరు. అలాంటప్పుడు ఆ దేశ అవసరాలు ఇదిగో వీరి వల్ల తీరుతున్నాయి.
పాకిస్తాన్ దేశంలో బలుచిస్తాన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇది ఇరాన్ దేశానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ కొంతమంది నిత్యం అక్కడి నుంచి పెట్రోలు, డీజిల్ దొడ్డి దారిన తీసుకొస్తుంటారు. దీనికోసం మోటర్ బైక్ లను వాడుతుంటారు. అత్యంత కఠినమైన మార్గాల మీదుగా ప్రయాణం చేసి.. డీజిల్, పెట్రోలు తీసుకొస్తారు. ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్న బంకులకు అమ్ముతారు. తద్వారా పాకిస్తాన్ దేశంలో ఇంధన అవసరాలు తీరుతూ ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా అనేది విపరీతమైన పాపులర్టి సంపాదించుకున్న తర్వాత.. ఈ విషయాలు వెలుగు చూశాయి.
Also Read: ఇరాన్ జోలికి రావొద్దు… ట్రంప్‌కు పుతిన్ వార్నింగ్..!
ఇరాన్ దేశం నుంచి దొడ్డి దారిన పెట్రోలు, డీజిల్ తీసుకొచ్చిన తర్వాత.. పాకిస్తాన్లో ఉన్న పెట్రోల్ బంకులకు అమ్ముతారు. దాదాపు బలూచిస్తాన్ ప్రాంతంలోని మెజారిటీ ప్రజలకు ఇది ఒక ఉపాధి మార్గం. దీనికోసం వారు రోజుల తరబడి ప్రయాణం సాగిస్తారు. మామూలు ద్విచక్ర వాహనాల మీద ప్రయాణం సాగించి.. అక్కడినుంచి ఇంధనాన్ని తీసుకొస్తారు. మధ్య మధ్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి పూర్తిగా దొడ్డిదారిలో ప్రయాణం సాగిస్తారు. బలుచిస్తాన్ ప్రాంతం నుంచి యువకులు ఇరాన్ పెట్రోల్, డీజిల్ తీసుకొస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి..
మన దగ్గర కొద్ది రోజుల నుంచి అవసరాలకు సరిపడా ఇంధనం లభించకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. ఇది తాత్కాలికమైనప్పటికీ.. మన అవసరాలు పెరిగిపోవడంతో తిప్పలు తప్పడం లేదు. కాని పాకిస్థాన్లో రోజు ఇటువంటి పరిస్థితి అంటే.. ఆ దేశ ప్రజల సహనానికి ఒక నమస్కారం పెట్టాల్సిందే.
View this post on Instagram