spot_img
Homeఅంతర్జాతీయంPutin warning to Trump: ఇరాన్‌ జోలికి రావొద్దు... ట్రంప్‌కు పుతిన్‌ వార్నింగ్‌..!

Putin warning to Trump: ఇరాన్‌ జోలికి రావొద్దు… ట్రంప్‌కు పుతిన్‌ వార్నింగ్‌..!

Putin warning to Trump: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు రాజుకుంటున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ కారణంగా ఇరాన్‌–అమెరికా మధ్య 20 రోజులుగా దాడులు ఆగాయి. అయితే శాంతి ఒప్పందంకోసం రెండు దఫాలు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మరోమారు చర్చలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో ఇరాన్‌పై దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. చేతిలో గన్‌ పట్టుకుని తన సొంత సోషల్‌ మీడియాలో ఒక పోస్టు చేసిన ట్రంప్‌.. మరుసటి రోజే దాడులకు సిద్ధమవుతున్నారు. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో ట్రంప్‌–పుతిన్‌ ఫోన్‌ సంభాషణ ఇరాన్‌ యుద్ధాన్ని దౌత్య మార్గాల్లోకి మళ్లించే అవకాశాన్ని సృష్టించింది. ఇరాన్‌పై మరో దాడి చేస్తే ప్రపంచవ్యాప్త ఆగ్రహానికి గురవుతారని పుతిన్‌ హెచ్చరించగా, ట్రంప్‌ ఉక్రెయిన్‌ కాల్పుల విరమణ సూచనలు ఇచ్చారు.

90 నిమిషాలు సంభాషణ..
అమెరికా, రష్యా అధ్యక్షులు ట్రంప్, పుతిన్‌ సుమారు 90 నిమిషాల ఫోన్‌ కాల్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్, ఉక్రెయిన్‌ పరిస్థితులపై చర్చించారు. ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించిన ట్రంప్‌ నిర్ణయాన్ని పుతిన్‌ స్వాగతించారు. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ మరోసారి దాడి చేస్తే పశ్చిమాసియా మొత్తం ప్రపంచానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని క్రెమ్లిన్‌ సహాయకుడు యూరీ ఉషాకోవ్‌ వెల్లడించారు.

యురేనియం ఆఫర్‌
ఇరాన్‌ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను రష్యా తీసుకునేందుకు సిద్ధమని పుతిన్‌ ప్రతిపాదించారు. ‘మీరు సహాయం చేసే ముందు ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాలి‘ అని ట్రంప్‌ బదులిచ్చారు. రష్యా దౌత్య పరిష్కారాలకు సిద్ధమని పుతిన్‌ పునరుద్ఘాటించారు. త్వరలో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు అవకాశమని ట్రంప్‌ సంకేతాలు ఇచ్చారు. పుతిన్‌ కొద్ది రోజులపాటు విరమణ సూచించారని చెప్పారు. ఇది మూడేళ్ల యుద్ధానికి మలుపుగా మారనుంది.

గ్లోబల్‌ పరిణామాలు
ఇరాన్‌ యుద్ధం, ఉక్రెయిన్‌ సంక్షోభం రెండింటినీ ఒకేసారి పరిష్కరించాలని ఇద్దరూ ఒక్కసారి కోరారు. హార్మూజ్‌ జలసంధి, చమురు సరఫరా ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. భారత్‌ వంటి దేశాలకు ఇంధన ధరలు స్థిరపడే అవకాశం కలుగుతుంది.

రష్యా ఇరాన్‌తో ఉద్రిక్తతల తగ్గింపుకు మధ్యవర్తిగా రంగంలోకి రానుంది. ట్రంప్‌ రెంబో విధానం దౌత్యానికి మార్పు చెందుతుంది. దీంతో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గిపోయి. చర్చల మార్గం తెరుచుకుంటుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

SIM Card Cut Corner

SIM Card Cut Corner: సిమ్ కార్డుకు ఒకవైపు కట్ చేసి ఉంటుంది.. ఎందుకో తెలుసా..

SIM Card Cut Corner: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా మారింది. కమ్యూనికేషన్ కోసం ఎంతో ఉపయోగపడే ఈ ఫోన్లో సిమ్ లేకపోతే ఎలాంటి పనులు చేయరాదు....
Divi Bigg Boss Host

Bigg Boss Host: ‘బిగ్ బాస్’ హోస్ట్ గా టీం ఇండియా కెప్టెన్.. ఇది మామూలు ట్విస్ట్ కాదు...

Bigg Boss Host: దేశవ్యాప్తంగా వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు చూసే ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ప్రపంచవ్యాప్తంగా ఈ రియాలిటీ షో 'బిగ్ బ్రదర్' అనే పేరుతో...
Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
Oktelugu Epaper