Homeఅంతర్జాతీయంPakistan double game: పాకిస్తాన్‌ డబుల్‌ గేమ్‌.. అమెరికాకు అగ్ర తాబూలం..

Pakistan double game: పాకిస్తాన్‌ డబుల్‌ గేమ్‌.. అమెరికాకు అగ్ర తాబూలం..

Pakistan double game: ఇరాన్‌–అమెరికా మధ్య సీజ్‌ఫైర్‌ కుదిర్చిన పాకిస్తాన్‌.. దానిని శాశ్వత శాంతి దిశగా తీసుకెళ్లి.. తాను శాంతి దూతగా పిలిపించుకోవాలని పాకిస్తాన్‌ పాకులాడుతోంది. ఈ క్రమంలో ఇస్లామాబాద్‌ వేదికగా నిర్వహించిన తొలిదశ చర్చలు విఫలమయ్యాయి. మలి దశ చర్చలకు ఇరాన్‌ హ్యాండ్‌ ఇచ్చింది. సాధ్యం కాని షరతులతో అమెరికా ఇబ్బంది పెడుతోందని మండిపడింది. తమ షరతులు అంగీకరిస్తేనే చర్చలకు వస్తామని తెలిపింది. అతతే పాకిస్తాన్‌ మాత్రం ఇరాన్‌ షరతులను పట్టించుకోకుండా కేవలం అమెరికా కండీషన్స్‌కే ఫ్రాధాన్యం ఇస్తోంది. దీంతో పాకిస్తాన్‌ తీరుపై ఇరాన్‌ మండిపడుతోంది. పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌పై డబుల్‌ గేమ్‌ ఆరోపణలు చేసింది. దీంతో శాంతి చర్చలను సంక్షోభంలోకి నెట్టింది.

పాక్‌ డబుల్‌ గేమ్‌ ఆరోపణలు
ఇరాన్‌ నేతలు పాకిస్తాన్‌పై మోసపూరిత ఆరోపణలు చేసింది. ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ అమెరికాకు అనుచరుడిగా ఉంటూ, ఇరాన్‌తో రహస్య సైనిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని పేర్కొంది. ఇరాన్‌ ప్రతిపాదించిన 10 అంశాలను పట్టించుకోకుండా, వాషింగ్టన్‌ 16 డిమాండ్లను ప్రోత్సహిస్తున్నారని ఫట్టం పుట్టింది. ఇది ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

అసిమ్‌ మునీర్‌ వైఖరి వివాదాస్పదం..
పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌ ఇరాన్‌తో డ్రోన్లు, క్షిపణులు సంబంధమై రహస్య ఒప్పందాలు చేస్తున్నారని అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదికలు సూచిస్తున్నాయి. టెహ్రాన్‌లో గతంలో డిఫెన్స్‌ అటాచీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఇరాన్‌తో బలమైన బంధాలను కల్పించింది. అయితే, ఇది అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని విమర్శలు వస్తున్నాయి.

శాంతి చర్చలపై ప్రభావం..
పాకిస్థాన్‌ మధ్యవర్తిగా అమెరికా–ఇరాన్‌ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరిగినప్పటికీ, ఈ ఆరోపణలు నీలినీడలు కమ్మిస్తున్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశాలకు ఇరాన్‌ పాల్గొనకపోవడం సంకేతం. గల్ఫ్‌ దేశాలతో పాక్‌ సంబంధాలు దెబ్బతింటాయని, అంతర్జాతీయ ఒంటరితనం పెరుగుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

పాక్‌ ఇరాన్‌తో సరిహద్దు పంచుకుని, మత సంబంధాలు బలమైనప్పటికీ, అమెరికా అనుబంధం, ఆర్థిక సంక్షోభం మధ్య డబుల్‌ పాలసీ దెబ్బకొట్టబడుతోంది. ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌పై ఫైర్‌ చేయడం ప్రాంతీయ శాంతి కృషికి అడ్డంకిగా మారింది. రాబోయే రోజుల్లో మరిన్ని దౌత్య ఒత్తిడులు తప్పవు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version