spot_img
Homeఅంతర్జాతీయంPakistan Day Cancellation Reason 2026: పాకిస్తాన్‌ డే రద్దు.. ఆర్థిక సంక్షోభం కాదు.. అసలు...

Pakistan Day Cancellation Reason 2026: పాకిస్తాన్‌ డే రద్దు.. ఆర్థిక సంక్షోభం కాదు.. అసలు కారణం ఇదే!

Pakistan Day Cancellation Reason 2026: సాధారణంగా ఏ దేశమైనా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్వసం, రాజ్యాంగ దినోత్సవం నిర్వహిస్తాయి. ఉగ్రవాదుల ముప్పు ఉంటే బల్లెట్‌ ప్రూఫ్‌ వాడి అయినా వేడుకలు జరుపుతారు. జాతీయ పండుగలను రద్దు చేయరు. ఎంత ఇబ్బంది ఉన్నా జాతీయ వేడుకలు వద్దని చెప్పే దేశం ఉండదు. కానీ అలా ఆదేశించిన దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్‌. ఆగస్టు 14న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే పాకిస్తాన్‌ మార్చి 23న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటుంది. ఇక లాహోర్‌పై భారత్‌ దాడిచేసిన దినోత్సవాన్ని పాకిస్తాన్‌ రక్షణ దినంగా జరుపుకుంటుంది. ఇక కశ్మీర్‌ సాలిడారిటీ డే ఒకటి నిర్వహిస్తుంది. మార్చి 23 పాకిస్తాన్‌కు అత్యంత ముఖ్యమైనది. పాకిస్తాన్‌ డే. పాకిస్తాన్‌ ప్రత్యేక దేశం కోసం మొదటిసారి లాహోర్‌లో రెజల్యూషన్‌ పాస్‌ చేసింది మార్చి 23, 1940లో, ఇక 1956లో మార్చి 23న రాజ్యాంగం స్థాపన దినంగా జరుపుకుంటారు. ఈసారి ఆ వేడుకలు నిర్వహించొద్దని పాకిస్తాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద పెద్ద ర్యాలీలు అవసరం లేదని, ప్రజలు జమ కూడొద్దని నిర్ణయించింది. కేవలం జెండా ఎగురవేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్గానిస్తాన్‌ దాడి భయం అసలు కారణంగా కనిపిస్తోంది.

Also Read: రాజశేఖర్ కొత్త బిజినెస్ ను ఓపెన్ చేయడానికి వెళ్తున్న చిరంజీవి… ఇంతకీ ఆ బిజినెస్ ఏంటంటే..?

చారిత్రక ప్రాముఖ్యత..
1940 మార్చి 23న లాహోర్‌ రిజల్యూషన్‌తో పాకిస్తాన్‌ ఆలోచన మొదలైంది. 1956లో రాజ్యాంగ అమలుతో గణతంత్ర దినంగా జరుపుకుంటారు. సాధారణంగా 31–గన్‌ సెల్యూట్, సైనిక ప్రదర్శనలు జరుగుతాయి. ఈసారి పూర్తి రద్దు అరుదైన చర్య. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం గల్ఫ్‌ యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. పొదుపు చర్యల్లో భాగంగా వర్క్‌ వీక్‌ తగ్గింపు, వేతన కోతలతోపాటు వేడుకలు ఆపేశారు. ఇది దేశ చరిత్రలో మొదటిసారి.

ఆఫ్గానిస్తాన్‌ భయం..
పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌పై డ్రోన్‌ దాడులు, ఆస్పత్రి దాడితో (400 మరణాలు) ఉద్రిక్తత పెరిగింది. ఆఫ్గాన్‌ ప్రతీకారంగా నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్, సైనిక పోస్టులపై దాడి చేసి 8 మంది చంపింది. 4–5 పోస్టులు ఆక్రమించింది. ఈ భయంతో ఇస్లామాబాద్‌లో పెద్ద సమావేశాలు నివారించారు.

ఆర్థిక సంక్షోభం (చమురు రిజర్వులు తక్కువ) ప్రభుత్వానికి ఒత్తిడి మొదలైనా, ఆఫ్గాన్‌ సరిహద్దు ఉద్రిక్తత ప్రధానం. పెద్ద ర్యాలీలు లక్ష్యాలుగా మారే భయం రద్దుకు దారితీసింది. ఇది పాక్‌ సైనిక బలం, ఆర్థిక స్థిరత్వం బలహీనతలను తెలియజేస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper