Pakistan Cyber War : ఇప్పటికే ఉగ్రవాద దేశానికి సంబంధించిన కీలకమైన నిర్మాణాలను భారత్ పడగొట్టింది. ఉగ్రవాద స్థావరాలను నేల కూల్చింది. ఇప్పట్లో కోలుకోకుండా చేసింది. అయినప్పటికీ ఉగ్రవాద దేశం మారదు. మారే అవకాశం కూడా లేదు.. ఇప్పట్లో ఆ దేశానికి బుద్ధి వస్తుందని నమ్మకం కూడా లేదు. తాజాగా భారత్ పై .. మనదేశంలో కీలకమైన మౌలిక సదుపాయాల వెబ్ సైట్ ల పై సైబర్ అటాచ్ చేసింది. మిలటరీ, రైల్వే, విమానాశ్రయాలు, బ్యాంకింగ్, ఎన్నికల కమిషన్, డిఫెన్స్ వంటి కీలక రంగాల సర్వర్లను తన ఆధీనంలోకి తీసుకొని.. మొత్తం భారతదేశాన్ని సర్వనాశనం చేయాలని చూసింది.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 లక్షల సార్లు దాడి చేయడానికి ప్రయత్నాలు చేసింది. కేవలం ఉగ్రవాద దేశం మాత్రమే కాదు, మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కూడా ఈ పాపంలో పాలుపంచుకుంది. ఈ 15లక్షల సైబర్ దాడులలో 150 విజయవంతమయ్యాయి. ఒక రకంగా ఉగ్రవాద దేశం సైబర్ దాడులలో కూడా 99.99 శాతం ఫెయిల్యూర్ అయింది. భారత నిఘా వర్గాలు చెబుతున్నట్టుగా చాలాకాలంగా ఉగ్రవాద దేశానికి చెందిన హ్యాకర్స్ మన దేశానికి సంబంధించిన కీలకమైన వెబ్ సైట్లపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఈసారి మాత్రం అత్యంత భయంకరంగా దాడులు చేశారు. ఇలాంటి ప్రమాదాలను ముందే గమనించిన మన దేశం ఏకంగా సైబర్ డోమ్ ఏర్పాటు చేసుకుంది. పటిష్టమైన వాల్స్ ను రూపొందించుకుంది. అందువల్లే పాకిస్తాన్ కు చెందిన హ్యాకర్ల పప్పులు ఉడకలేదు. దీనికి సంబంధించిన నివేదికను మహారాష్ట్ర సైబర్ విభాగం రూపొందించింది. దీనిని మహారాష్ట్ర డిజిపి, ఇతర నేరవి భాగాలకు కూడా పంపించినట్టు మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీ యశస్వి యాదవ్ వెల్లడించారు.
Also Read : పాకిస్థాన్ ఒప్పుకోలు.. ఆపరేషన్ సిందూర్‌లో 11 మంది సైనికుల మృతి
సైబర్ దాడులు ఆగలేదు
ఉగ్రవాద దేశంతో జరుగుతున్న యుద్ధం కాస్త సడలినప్పటికీ.. సైబర్ దాడులు మాత్రం ఆగలేదు. గీతికంగా మాల్వేర్ క్యాంపెయిన్స్, డి డి ఓ ఎస్ (distributed deniel of service), జిపిఎస్ స్కూఫింగ్ వంటి విధానాలలో పాక్ సైబర్ దాడులు చేసింది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రచారాన్ని చేస్తున్న వాటిపై కూడా కేంద్రం ఉక్కు పాదం మోపింది. మన దేశం మీద నేరుగా దాడి చేయలేక సోషల్ మీడియా ద్వారా ఫేక్ ఇన్ఫర్మేషన్ ను పాకిస్తాన్ స్ప్రెడ్ చేసింది. బ్యాంకుల డేటా హ్యాక్ చేసామని చెప్పింది. పవర్ సప్లై నిలుపుదల చేశామని గొప్పలు చెప్పుకుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ జామ్ చేశామని జబ్బలు చరుచుకుంది. చివరికి మిస్సైల్స్ స్టోరేజ్ ఫెసిలిటీ ని కూడా బ్లాక్ చేశామని గొప్పలు చెప్పుకుంది. వాస్తవం మాత్రం ఇది.. మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ ఐదువేల ఫేక్ ఇన్ఫర్మేషన్ న్యూస్ ను బ్లాక్ చేసింది. దీనికంటే ముందు భారత ప్రభుత్వం సుమారు 8వేల ఎక్స్ ఖాతాలను బ్లాక్ లో పెట్టేసింది. వాస్తవానికి భారత ప్రభుత్వ ఒత్తిడికి ఎక్స్ తలవంచి ఈ ఆదేశాలను అమలు చేయాల్సి వచ్చింది. యూట్యూబ్ ఛానల్స్ విషయంలోనూ భారత్ ఇదే ధోరణి కొనసాగించింది. మొత్తంగా ఏడు హ్యాకర్ గ్రూపులను పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినట్టు ఇండియన్ సైబర్ డిపార్ట్మెంట్ గుర్తించింది. అయితే వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది.. ఆ గ్రూపులను ఎలా నిర్వీర్యం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది.