Viral Video : ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లం కొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), తొలిసినిమా అల్లుడు శ్రీను చిత్రంతోనే భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈయన నుండి విడుదలైన సినిమాలేవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఆయన హిందీ లోకి వెళ్లి ఛత్రపతి సినిమాని రీమేక్ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. కానీ ఆ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈయన కెరీర్ మొత్తం మీద అల్లుడు శ్రీను తర్వాత ఎదో పర్వాలేదు, బాగానే ఆడాయి అని అనిపించుకున్న చిత్రాలు రాక్షసుడు, జయ జానకి నాయక. ఇప్పుడు ఆయన ఆశలన్నీ ‘భైరవం'(Bhairavam) చిత్రం పైనే ఉన్నాయి. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read : నాటు నాటు’ పాటకు కలిసి డ్యాన్స్ వేయబోతున్న చిరంజీవి, బాలకృష్ణ..ఎక్కడంటే!
ఇదంతా పక్కన పెడితే బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటర్వ్యూస్ కొన్ని చూస్తే రాముడు మంచి బాలుడు లెక్క అనిపిస్తాడు. కానీ ఇతనిలో కూడా భీభత్సమైన యాటిట్యూడ్, పొగరు ఉందని నేడు ఒక సంఘటన చూసిన తర్వాత అర్థమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించి, రాంగ్ రూట్ లో కారులో వస్తూ ఉన్నాడు. దీనిని గమనించిన ట్రాఫిక్ పోలీస్ బెల్లంకొండ కారుని ఆపి నిలదీయడం తో, కోపం తో ఊగిపోయిన బెల్లంకొండ, ట్రాఫిక్ పోలీస్ ని పట్టించుకోకుండా, కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. జర్నలిస్ట్ కాలనీ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ బెల్లకొండ శ్రీనివాస్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ట్రాఫిక్ పోలీస్ ని లెక్క చేయకుండా అతను అంత పొగరుగా వెళ్లిపోతుంటే అతని పై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఆ ట్రాఫిక్ పోలీస్ వేడుక చూస్తున్నాడు?.
ఇదే ఒక సామాన్యుడు చేస్తే ఊరుకుంటారా?, నీరు ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కదా?, సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా?, ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ మండిపడుతున్నారు నెటిజెన్స్. పోలీసులు ఎలా ప్రవర్తించిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అందరినీ సమాన ద్రుష్టి తో చూస్తాడని, కచ్చితంగా ఇది ఆయన దృష్టికి తీసుకెళ్తే కఠిన చర్యలు ఉంటాయని సోషల్ మీడియా లో నెటిజెన్స్ సీఎం రేవంత్ రెడ్డి ని ట్యాగ్ చేసి ఈ వీడియో ని షేర్ చేస్తున్నారు. మరి ఆయన నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి. ఇకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘భైరవం’ చిత్రం లో నారా రోహిత్, మంచు మనోజ్ లు కూడా కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. టీజర్ తో విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, ప్రేక్షకులను ఎంతమేరకు అలరిస్తుందో చూడాలి.
జూబ్లీహిల్స్‌లో కారుతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్‌చల్
జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్‌లో కారుతో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును ఆపి నిలదీయటంతో వెళ్లిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్ pic.twitter.com/iyOeNUaWol
— Telugu Scribe (@TeluguScribe) May 13, 2025