Pakistan Army Rent: ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్తాన్.. ఇప్పుడు కొత్త వ్యాపారం మొదలు పెట్టింది. ఇప్పటికే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ దేశంలోని రేర్ ఎర్త్ మినరల్స్ పట్టుకుని విదేశాల్లో పర్యటిస్తున్నారు. అమెరికాతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇక ఇప్పుడు సైన్యంతో మునీర్ పత్తేపారం మొదలు పెట్టారు. తమ సైన్యాన్ని కూడా డబ్బున్న దేశాలకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల పాకిస్తాన్–సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం అంతర్జాతీయ వేదికల్లో చర్చకు దారితీసింది. పైకి ఇది పరస్పర భద్రతా కూటమిలా కనిపించినా, అంతర్గతంగా ఇది సైన్య అద్దె ఒప్పందంగా మారిపోయిందని వ్యూహ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రకారం, పాక్ సుమారు మారింది. 25 వేల మంది సైనికులను సౌదీ భూభాగానికి పంపాలనుకుంటోంది. ఇదిలా చేయడానికి ప్రతిగా సౌదీ, పాకిస్తాన్‌కు 88 వేల కోట్ల పాకిస్తాన్ రూపాయలు చెల్లించనుంది.
Also Read: ప్రమాదానికి కారకుడు ఈ బైకర్.. పెట్రోల్ బంకులో ఈ దారుణం.. సీసీ టీవీ వీడియో
ఆర్థిక కుప్పకూలి మార్గాల వెతుకులాట..
పాకిస్తాన్ ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన ఆర్థిక పరిస్థితిలో ఉంది. ఐఎంఎఫ్ సహాయ ప్యాకేజీలతో కూడా వృద్ధి సాధ్యం కాలేదు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఖజానా ఖాళీ అయిపోవడం, అంతర్జాతీయ రుణదాతల ఒత్తిడి వలన, ఇస్లామాబాద్ ‘సైన్యాన్ని ఆదాయ వనరుగా’ ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు సైన్యాన్ని దేశ రక్షణ కోసం ఉపయోగించిన పాక్, ఇప్పుడు ఆర్థిక ఆదాయానికి సైనికులను ప్రత్యేక కాంట్రాక్టు విభాగాల్లా వాడబోతుంది. ఇది ప్రపంచ రక్షణ చరిత్రలో కొత్త ఉదాహరణగా చెప్పవచ్చు.
సౌదీకి భద్రతా ప్రయోజనాలు..
సౌదీ అరేబియా ఈ ఒప్పందం ద్వారా తన భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇరాన్ ఉద్రిక్తతలు, యెమెన్ సరిహద్దు ఘర్షణలు, హజ్ సీజన్ భద్రత వంటి సందర్భాల్లో అనుభవజ్ఞులైన పాక్ సైన్యం అవసరమవుతుంది. తద్వారా సౌదీకి స్వీయ రక్షణ శక్తిని పెంచుకోవడమే కాకుండా, అంతర్గత భద్రతను కూడా పాక్ మద్దతుతో బలోపేతం చేసుకోవాలనుకుంటోంది.
పాకిస్తాన్‌కు తాత్కాలిక ఉపశమనమే ..
పాక్ ప్రభుత్వానికి ఈ ఒప్పందం ద్వారా తాత్కాలిక ఆర్థిక ఊతం లభించినా, దీర్ఘకాల వ్యూహాత్మక పరువు నష్టం కలుగుతుందనే అభిప్రాయం వ్యాపిస్తోంది. సైన్యాన్ని అద్దెకు ఇవ్వడం జాతీయ రక్షణ భావాన్ని బలహీనపరుస్తుంది. విదేశీ యుద్ధాల్లో పాల్గొన్నప్పుడు పాక్ అంతర్జాతీయ నిష్పాక్షికత కోల్పోతుంది. సౌదీ–ఇరాన్ సంబంధాలు మళ్లీ ఉద్రిక్తమైతే పాక్ సైన్యం ఇరుక్కుపోవచ్చు. ఇదంతా చూస్తుంటే పాక్‌ను ఓ రక్షణ కాంట్రాక్టర్ దేశంగా మలచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
1980లలో సోవియట్–ఆఫ్గాన్ యుద్ధం సమయంలో కూడా పాక్, అమెరికా సూచనలతో మత ఉగ్రవాదులకు శిక్షణ కేంద్రంగా మారింది. ఇప్పుడు అదే దేశం మరోసారి విదేశీ యుద్ధాల కోసం సైన్యాన్ని అద్దెకు పెట్టడం అది ఎంతవరకు బయటపడగలదన్న ప్రశ్నను తెస్తోంది. సౌదీతో జరిగిన ఈ రక్షణ ఒప్పందం పాకిస్తాన్ ఆర్థిక పునరుద్ధరణకు తాత్కాలిక ఉపశమనం ఇస్తుందేమో కానీ, దీని భద్రతా స్వతంత్రతను ప్రశ్నించే దశకు తీసుకువెళ్తుంది. సైనిక బలం ఒక దేశ ఆస్తి, కానీ దానిని ‘‘అద్దె వ్యవస్థ’’గా మార్చడం అంతర్జాతీయ స్థాయిలో పాక్ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉంది.