Ravi Teja Mass Jathara: కరోనా లాక్ డౌన్ తర్వాత మన టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాత నాగవంశీ(Nagavamsi). కానీ పాపం ఈమధ్య మనోడికి అసలు ఏది కలిసి రావడం లేదు. నోరు తెరిస్తే కాంట్రవర్సీ అయిపోతుంది. ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇతను మాట్లాడిన మాటలు, ఆ తర్వాత సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో సోషల్ మీడియా లో ఎదురైనా నెగిటివిటీ ని చూసి, ఇక కెమెరా ముందు రాను బాబోయ్ అని చెప్పుకొచ్చాడు. కానీ ఆయన నిర్మాతగా వ్యవహరించిన ‘మాస్ జాతర’ చిత్రం ఈ నెల 31 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఎడాపెడా ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నాడు. కానీ ఇంతకు ముందు లాగా ఎవరికీ పడితే వాళ్లకు కాకుండా, కేవలం కొన్ని సెలెక్టివ్ ఇంటర్వ్యూస్ మాత్రమే ఇస్తున్నాడు. అయితే మనోడి దురదృష్టం ప్రస్తుతం ఎలా ఉందో చెప్పడానికి మరో ఉదాహరణగా నిల్చిన ‘మాస్ జాతర’ చిత్రం.
Also Read: ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో మిస్ అయిన మహేష్ బాబు సినిమా అదేనా?
షెడ్యూల్ చేసిన ప్లాన్ ప్రకారం ‘మాస్ జాతర’ చిత్రం అక్టోబర్ 31 న విడుదల అవ్వాలి. కానీ కొన్ని అనుకోని కారణాల చేత ఈ సినిమా అక్టోబర్ 31న కాకుండా, నవంబర్ 1 న విడుదల చేస్తున్నారని టాక్. అక్టోబర్ 31 న ప్రీమియర్ షోస్ ఉంటాయట. ఇది ఈ సినిమాకు ఎంత నష్టమో మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ప్రస్తుతం రవితేజ(Mass Maharaja Ravi Teja) కెరీర్ పరంగా చాలా గడ్డు పరిస్థితి ని ఎదురుకుంటున్నాడు. వరుసగా ఆరు ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఒకప్పటి లాగా ఇప్పుడు మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి లేదు. సినిమాకు బాగుంది అనే టాక్ వస్తేనే ఆయన సినిమాకు ఇప్పుడు జనాలు కదులుతారు. లేదంటే సినిమా పని అయిపోయినట్టే. అక్టోబర్ 31 న మార్నింగ్ షోస్ తో సినిమా మొదలై, మంచి టాక్ వస్తే ఫస్ట్ షోస్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు నమోదు అయ్యేవి.
కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం ఒకరోజు ముందుకు వాయిదా పడింది. అక్టోబర్ 1 రాత్రి ప్రీమియర్ షోస్ వేస్తామని అంటున్నారు. ఒకవేళ ఈ షోస్ నుండి మంచి టాక్ వస్తే, ఈ నవంబర్ 1న విడుదలయ్యే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్ ఉంటుంది. లేదంటే మిస్టర్ బచ్చన్ కంటే పెద్ద ఫ్లాప్ అయ్యే అవకాశాలే ఎక్కువ. హిట్ అయినా, ఫ్లాప్ అయినా నిర్మాత నాగవంశీ కి ఈ వాయిదా వల్ల ఒక రోజు కలెక్షన్స్ మొత్తం నష్టపోయినట్టే. అంటే అక్షరాలా నాలుగు కోట్ల రూపాయిల నష్టం అన్నమాట. విడుదలకు ముందే ఇలాంటి నష్టం రావడం నాగవంశీ కి పెద్ద షాక్. కచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ రావాలి, లేదంటే మరో భారీ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నాగవంశీ కి, చూడాలి మరి ఏమి జరగబోతుందో