Pakistan Afghanistan Conflict 2025: అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్ దేశం మీద అడ్డగోలుగా దాడులు చేస్తోంది. ఎప్పుడైతే అమెరికా ఫోల్డ్ లోకి పాకిస్తాన్ వెళ్ళిందో.. అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ అత్యంత తెలివిగా భారత్ కు దగ్గరయింది. ఖనిజాల తవ్వకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతేకాదు అమెరికా అండ చూసుకొని రెచ్చిపోతున్న పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది.
ఇటీవల ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాకిస్తాన్ మీద దాడులు చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను భారత దళాలు నేల కూల్చాయి. అనేకమంది ఉగ్రవాదులను హతం చేశాయి. దీని నుంచి స్ఫూర్తి పొందిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశానికి నరకం అంటే ఏమిటో రుచి చూపిస్తోంది. కొద్దిరోజులుగా ఆఫ్గనిస్తాన్ దేశంపై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. వీటిని మొదట్లో అంతగా పట్టించుకోని ఆఫ్ఘనిస్తాన్.. ఆ తర్వాత కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశంపై దాడులకు దిగింది. ఏకంగా 58 మంది పాకిస్తాన్ సైనికులను హతం చేసింది. ఈ విషయాన్ని తాలిబన్ ప్రతినిధి ముజాయిద్ వెల్లడించారు.
ఆఫ్ఘనిస్తాన్ దేశంపై కొంతకాలంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా సరిహద్దు, గగనతల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి ఆఫ్ఘనిస్తాన్ గట్టిగా బదులిచ్చింది. ఏకంగా 25 పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది. అంతేకాదు ఐ సిస్ ఉగ్రవాదులకు స్థావరం గనుక ఇస్తే పాకిస్తాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.. అమెరికా అండ చూసుకొని పాకిస్తాన్ రెచ్చిపోతోందని.. అలాంటి ఆటలు తమ ముందు సాగవని ఆఫ్గానిస్థాన్ హెచ్చరిస్తోంది. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే తాము అంతకంటే గట్టిగా బదులిస్తామని స్పష్టం చేసింది.
పాకిస్తాన్లో విలువైన వనరులు ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో అమెరికాకు దగ్గర కావడం మొదలుపెట్టింది. అమెరికా కూడా పాకిస్తాన్ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంది. ఓ నివేదిక ప్రకారం ఈ వ్యాపార విలువ 500 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు. మరోవైపు పాకిస్తాన్ అమెరికాతో దగ్గర కావడాన్ని ఆఫ్గనిస్తాన్ అత్యంత లోతుగా పరిశీలించి.. భారతదేశానికి దగ్గర అయింది. త్వరలోనే తమ దేశంలో ఉన్న ఖనిజాలను తవ్వి తీసే బాధ్యతను భారతదేశంలో కంపెనీలకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా సాగుతుండగానే రెండు దేశాల మధ్య భీకరమైన పోరాటాలు జరుగుతుండడం విశేషం. అయితే పాకిస్తాన్ దేశానికి గట్టి బదులు ఇస్తున్న నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది.