1999లో భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ తీవ్రవాదులు, సైన్యం వాస్తవాధీనరేఖ దాటి భారత్‌లోకి చొరబడిన కారణంగా ఈ యుద్ధం జరిగింది. పాకిస్తాన్ దీనిని కశ్మీర్‌లో తిరుగుబాటు అని మొదట వాదించింది. కానీ యుద్ధంలో మరణించిన వారి వద్ద లభించిన ఆధారాలతో యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం పాల్గొన్నట్లు రుజువైంది. నియంత్రణరేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుదిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగియున్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది. ఇంతకాలం కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొనలేదని బుకాయించిన పాకిస్తాన్ సైన్యం ఎట్టకేలకు తాము పాల్గొన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ సైన్యాధిపతి బహిరంగ ప్రకటన చేశారు. దీంతో.. పాతికేళ్ల తర్వాత పాక్ సైన్యం తమ పాత్రను అంగీకరించినట్లయ్యింది.
అధికారిక ప్రకటన
రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యక్రమంలో పాక్ డిఫెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఇందులో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ప్రసంగిస్తూ.. ‘భారత్, పాకిస్థాన్ మధ్య 1948, 1965, 1971, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది‘ అని తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దొంగ దారిన భారత్‌లోకి చొచ్చుకువచ్చి.. మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని పాక్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. భారత సైన్యం కొట్టిన దెబ్బకు.. తోక ముడుచుకుని వెనక్కి తిరిగి పారిపోయింది. అయితే యుద్ధంలో చావుదెబ్బ తిన్న పాక్.. అవమానంతో యుద్ధం చేసింది తాము కాదంటూ ఇన్నేళ్లపాటు అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది. కానీ తాజాగా ఆ దేశ సైన్యాధిపతి బహిరంగంగా కార్గిల్ యుద్ధం చేసింది తామే అంటూ చెప్పడం సంచలనంగా మారింది.
ఆపరేషన్ విజయ్..
1999 మే–జులై మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ముజాహిదీన్ భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన శత్రుసేనలు.. కార్గిల్లో ముసుగులో నియంత్రణ రేఖను దాటి ఖాళీగా ఉన్న భారత కీలక స్థావరాలను వశం చేసుకున్నాయి. కౌంటర్ ఇండియన్ ఆర్మీ ’ఆపరేషన్ విజయ్’ పెట్టింది. ఈ ఎదురుదాడితో బెంబేలెత్తిపోయిన పాక్.. తోకముడుచుకుని పారిపోయింది. జులై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించగా.. అప్పటి నుంచి ఆ తేదీన నిర్వహించుకుంటున్నాం. కార్గిల్ విజయ్ దివస్
సంబంధం లేదని బుకాయించి..
అయితే.. ఈ యుద్ధంతో తమ సైన్యానికి ఎలాంటి సంబంధం లేదని పాక్ చెబుతూ వస్తోంది. ముజాహిదీన్ ఫైటర్లు ఈ దాడులకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము పాట్రోలింగ్ మాత్రమే చేశామని చెప్పింది. గతంలో పాక్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్లో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని చెప్పారు. ఆ ఆపరేషన్ను ’ఫోర్ మ్యాన్ షో అని లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) షాహిద్ అజీజ్ అభివర్ణించారు. అయితే పాక్ ఆయన వ్యాఖ్యలపై స్పందించలేదు. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ ప్రకటనతో.. పాక్ ఓటమి గుట్టు బట్టబయలైంది.
కీలక ఆధారాలు బయటపెట్టిన భారత్..
ఇదిలా ఉంటే.. పాక్ బుకాయింపులను నమ్మని భారత్.. వాటి ఆరోపణలను ఖండించింది. అంతేకాకుండా కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యం పాత్రకు సంబంధించి కీలక ఆధారాలను బయటపెట్టింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్.. ఆయన డిప్యూటీ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అజీజ్‌లు రావల్పిండిలో మాట్లాడుకున్న ఫోన్ సంభాషణలను భారత్ విడుదల చేసింది. దీనిలో.. భారత్ పాక్ మధ్య ఎల్‌వోసీని మార్చడమే అంతిమ లక్ష్యమని ముషారఫ్ తన డిప్యూటీకి చెప్పినట్లు వివరాలు బయటికొచ్చాయి. గతంలో పాక్ ఆర్మీ మాజీ అధికారి ఒకరు కూడా కార్గిల్ యుద్ధంలో తమ దేశ బలగాల పాత్ర నిజమేనని వెల్లడించారు. ఇక ఆ ఆపరేషన్‌కు ఫోర్ మ్యాన్ షో అని పాక్ పెట్టినట్లు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) షాహిద్ అజీజ్ అభివర్ణించారు. అప్పటి ఆర్మీ జనరల్ ముషారఫ్‌తో పాటు కొందరు టాప్ కమాండర్లకు మాత్రమే దీని గురించి తెలుసని చెప్పారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Pakistan admitted wrongdoing on kargil war
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com